మాతృ దినోత్సవం రోజున ఘోరం: తల్లిని హింసించి, లైంగిక దాడి, భారత సంతతి వ్యక్తి అరెస్ట్
న్యూయార్క్: అమెరికాలో మాతృ దినోత్సవం రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిని ఎంతో గౌరవించాల్సిన రోజున.. ఓ కొడుకు ఘోరానికి తెగబడ్డాడు. కన్న తల్లిని దారుణంగా హత్య చేయడమేగాకుండా, ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో చోటు చేసుకుంది.

పొద్దున నిద్రలేస్తూనే దారుణ ఆలోచనతో..
భారత సంతతికి చెందిన పుష్కర్ శర్మ(28) తన తల్లి సోరజ్ శర్మ, సోదరితో కలిసి ఉంటున్నాడు. అయితే, గత కొంతకాలంగా పుష్కర్ శర్మ మానసికంగా రుగ్మతతో బాధపడుతున్నాడు. మాతృదినోత్సవం రోజైన శనివారం ఉదయం పుష్కర్ ఒక చెడు ఆలోచనతో నిద్రలేచాడు. ఎవరినైనా దారుణంగా హింసించాలని నిర్ణయించుకున్నాడు.

తల్లిని హింసించి.. లైంగిక దాడి..
ఈ క్రయంలో శనివారం ఉదయం ఇంట్లో ఉన్న తన తల్లి సోరజ్ శర్మను వెనుక నుంచి గట్టిగా పట్టుకుని ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. అయినా ఆగకుండా ఆమెను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ తర్వాత ఆమె సృహ కోల్పోవడంతో కన్న తల్లి అని కూడా చూడకుండా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె మరణించింది.

పోలీసుల ముందు నేరం అంగీకరించిన నిందితుడు
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు పుష్కర్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, ఇంటికి తిరిగి వచ్చిన నిందితుడి సోదరి.. తన తల్లి కింద పడివుండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. అయితే, అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.
Recommended Video

విషాదంగా మారిన మదర్స్ డే...
మదర్స్ డే రోజున ఈ దారుణ ఘటన జరగడంపై క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ మెలిందా కట్జ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన మాతృ దినోత్సవం విషాదంగా మారిపోయిందని అన్నారు. నేరం రుజువు కావడంతో నిందితు పుష్కర్ శర్మకు బెయిల్ దొరక్కుండా జైలుకు తరలించారు. మే 24కు తదుపరి విచారణను స్థానిక కోర్టు వాయిదా వేసింది. సోరజ్ కుటుంబం తమతో ఎంతో స్నేహంగా ఉండేదని ఇరుగుపొరుగువారంటున్నారు. పుష్కర్ శర్మ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని తెలుసు కానీ, ఇంత దుర్మార్గానికి తెగబడుతాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications