కారు నడుపుతూ లైంగిక క్రీడ: ప్రేయసి మృతితో జైలు

లండన్: గర్ల్ ఫ్రెండ్ మృతికి కారణమైన భారత సంతతి వ్యక్తికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బిఎండబ్ల్యును నడుపుతూ 36 ఏళ్ల మినేష్ పర్భాత్ ప్రేయసితో లైంగిక క్రీడ సాగించాడు. ఆ సమయంలో కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పోతోంది. ఆ సమయంలో వాహనానికి ప్రమాదం సంభవించింది.

ఆ ప్రమాదం నిరుడు మార్చిలో జరిగింది. ప్రమాదంతో అతని ప్రేయసి కారులోంచి పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. లీసా వాట్లింగ్ ఆనే ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Indian-Origin Man Jailed For Sex Act in BMW, Girlfriend was Killed

ప్రమాదం జరిగిన తర్వాత పర్భాత్ అండర్ వియర్, ప్యాంట్ మోకాళ్ల వరకు జారి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. టీ షర్ట్, బ్రా మాత్రమే ధరించి ఉన్న వాట్లింగ్ తీవ్రంగా గాయపడింది. లైంగిక క్రీడ జరుపుతూ కారును గంటకు 70 కిలోమీటర్ల వేగంతో నడిపే ప్రయత్నంలో ప్రమాదం సంభవించిందని, దాని వల్ల ప్రమాదం జరిగి లీసా మరణించిందని సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లూయిస్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి పీటర్ గ్రిఫిత్స్ చెప్పారు.

ప్రమాదానికి కారణం పర్భాతేనని కోర్టు స్పష్టం చేసింది. లైంగిక క్రీడ సాగించలేదని తొలుత పర్భాత్ వాదించాడు. అతని ముఖానికి గాయాలయ్యాయి. వాహనం నడుపుతున్నట్లు ఆతను పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నట్లు కూడా పరీక్షల్లో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+