భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా ఎంపీ డానియల్
సిడ్నీ: భారత సంతతికి చెందిన ఎంపీ ఒకరు ఆస్ట్రేలియాలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత సాక్షిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత సంతతికి చెందిన డానియల్ మూకీ (32) ఎంపీగా గెలుపొందారు. ఆస్ట్రేలియాలో భగవద్గీత పైన ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు ఇతనే.
డానియల్ న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం నుండి ఆస్ట్రేలియాన్ లేబర్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. డానియల్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు.

ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలో భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రాజకీయ నాయకుడిని తానే అని, దీనిని అరుదైన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఆస్ట్రేలియా తన తల్లిదండ్రుల వంటి వారిని స్వాగతించిందని, అందుకే తనలాంటివారు ఈ స్థాయికి ఎదిగారని అన్నారు.












Click it and Unblock the Notifications