చిక్కు ప్రశ్నతో బ్రిటన్ ప్రధానిని ఇబ్బంది పెట్టిన భారత బాలిక, మెచ్చుకోలు
లండన్: భారత సంతతికి చెందిన ఓ పాఠశాల విద్యార్థిని వేసిన ప్రశ్నకు బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ఒకింత తికమక పడ్డారు. ఏ రాజకీయ నాయకుడో లేదా ఏ జర్నలిస్టో అడిగిన ప్రశ్నలకే సాధారణంగా తడుముకోకుండా సమాధానం చెబుతుంటారు. అలాంటిది ఓ చిన్నారిని కామెరూన్ తికమక పెట్టారు. ఆ విద్యార్థిని పేరు రీమా. ఈ విద్యార్థిని నార్తర్న్ ఇంగ్లాండ్ సిటీకి చెందిన వారు.
బీబీసీ నిర్వహించిన పిల్లల కార్యక్రమంలో కేమరూన్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. ఈ ఎన్నికల్లో మీరు తప్ప ఏ రాజకీయ నాయుకుడు గెలుస్తాడనుకుంటున్నారు? అందుకు కారణం ఏమిటి? అని రీమా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక 48 ఏళ్ల కేమరూన్ ఇరకాటంలో పడ్డారు. చివరికి సరైన సమాధానం చెప్పలేక డొంక తిరుగుడు ధోరణిలో ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డారు.

తాను కాకుండా ఏ రాజకీయ నాయకుడు గెలుస్తాడని నేను ఎలా ఎంపిక చేస్తాను, ఈ ఎన్నికల్లో గెలవాలనే నేను పోటీ చేస్తున్నాను, అలాంటప్పుడు నేను కాకుండా మరో రాజకీయ నాయకుడు గెలుస్తాడని ఊహించలేను, రంగంలో ఎందరో అభ్యర్థులున్నా విజయం నాదేనని భావిస్తున్నానని కేమరూన్ అన్నారు.
అంతేకాదు, ఈ ఎన్నికల్లో తాను గెలవలేనని భావిస్తే, మరొకరే గెలుస్తారని అనుకుంటే తాను పోటీలోనే ఉండేవాడ్ని కాదని చెప్పారు. కచ్చితంగా తానే గెలుస్తానని చెప్పారు. అంతేకాదు, ఇది చిన్న ప్రశ్నే అయినప్పటికీ ఇంతటి సంక్లిష్టమైన ప్రశ్న తనను ఎవరూ అడగలేదని కామెరూన్ అన్నారు. ఇదే అత్యుత్తమ ప్రశ్న అని కితాబిచ్చారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications