గర్ల్ ఫ్రెండ్‌ను కొట్టిన టెక్ మొఘల్: ఊడిన జాబ్

న్యూయార్క్: తన గర్ల్ ఫ్రెండ్‌ను కొట్టిన భారత సంతతికి చెందిన టెక్ మొఘల్ గుర్బక్ష్ చాహల్ జైలును తప్పించుకున్నప్పటికీ ఆయన ఉద్యోగం మాత్రం ఊడింది. తన గర్ల్ ఫ్రెండ్‌ను అతను 117 సార్లు కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సంస్థ సిఇవో, చైర్మన్ పదవి నుంచి తప్పించింది.

సిలికాన్ వ్యాలీ కంపెనీ రేడియంవన్ కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశమై సంస్థ చైర్మన్, సిఇవో పదవి నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థ వెబ్‌లో రియల్ అడ్వర్టయిజ్‌మెంట్, మొబైల్, ఫేస్ బుక్ వంటివాటిపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

Indian-origin tech mogul fired for allegedly beating girlfriend

చాహల్‌కు కోర్టు మూడేళ్ల ప్రొబెషన్‌ను విధించింది. 52వారాల పాటు గృహ హింస కార్యక్రమాల్లో పాల్గొనాలని, 25 గంటలు కమ్యూనిటీ సర్వీసు చేయాలని ఆదేశించింది. జైలు శిక్ష మాత్రం విధించలేదు. అయితే, తనపై ఆరోపణలు ఎక్కువ చేసి చూపించారని, జాతి కారణంగానే తనపై దాడి చేస్తున్నారని చాహల్ అంటున్నారు.

తన వ్యక్తిగత సమస్యపై చెడు ప్రచారం కారణంగా ఇబ్బందికి గురైనందునకు తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, ఉద్యోగులకు, కస్టమర్లకు, ఇన్వెస్టర్లకు క్షమాపణలు చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ నుంచి గృహ హింసకు సంబంధించిన కాల్ రావడంతో చాహల్ నిరుడు ఆగస్టులో అరెస్టయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+