గర్ల్ డ్రెస్‌పై వ్యాఖ్య: దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి

Indian-origin trainee teacher dies after attack in New Zealand
మెల్బోర్న్: న్యూజిలాండ్ దేశంలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన ట్రెయినీ టీచర్ దుండగుల దాడిలో గాయపడి అక్లాండ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత శనివారం దుండగుల దాడిలో గాయపడిన బాధితుడు తరుణ్ అస్థానా(25) అక్లాండ్ సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు పోలీసులు తెలిపారు.

అస్థనా చనిపోయే సమయంలో అతని కుటుంబసభ్యులు, స్నేహితులు అతనితోపాటే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి తన స్నేహితులను కలిసి వస్తున్న సమయంలో అస్థానాపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఓ మహిళ ధరించిన డ్రెస్ బాగుందని అస్థానా చేసిన వ్యాఖ్యలతో బాధపడిన ఆమె తనను ఆశ్రయించడంతో అతనిపై దాడి చేసినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు చెప్పారు.

నిందితుడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన అస్థానా స్పృహ కోల్పోయి ఘటనా స్థలంలోనే నేలపై పడిపోయాడు. క్వీన్ స్ట్రీట్‌లోని మెక్ డోనాల్డ్స్ ముందు కాలిబాటపై పడిపోయిన అతన్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన అస్థానా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దాడి జరిగిన అనంతరం దాడికి కారణమైన మహిళతోపాటు నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు విచారణాధికారి సార్జంట్ పీటర్ ఫ్లోరెన్స్ తెలిపారు.

నిందితులలో ఒకరైన గ్రేన్‌విల్లే మ్యాక్‌ఫర్లాండ్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. సోమవారం నిందితున్ని అక్లాండ్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నిందితుడు మ్యాక్‌‌ఫర్లాండ్‌కు నవంబర్ 15 వరకు రిమాండ్ విధించడం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా అస్థానా మరణానికి నిందితుడే కారణమని పోలీసులు ఇంకా తేల్చలేదు. విచారణ కొనసాగిస్తున్నట్లు, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

తరుణ్ అస్థానా ఎంతో మంచి వాడని, శాంతియుతంగా ఉండే వ్యక్తని అతని స్నేహితుడు శ్యామ్ మాథ్యూస్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ అక్లాండ్ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా ఎంపిక అయ్యేందుకు ట్రెయినింగ్ పొందుతున్నాడని చెప్పారు. తరుణ్ ఇతరుల పట్ల ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటాడని, అలాంటి వ్యక్తిని తాము కోల్పోయామని శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+