దారుణంగా హత్య చేసి సూట్ కేసులో కుక్కారు,ఏం జరిగింది

యూకెలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెను హత్య చేసి శవాన్ని సూట్ కేసులో పెట్టారు. పోలీసులు భారత సంతతికి చెందిన మహిళ కిరణ్ దాడియాగా గుర్తించారు.

లండన్ :భారత సంతతికి చెందిన ఓ మహిళ యూకెలో హత్యకు గురైంది. ఆమె మృతదేహన్ని సూట్ కేసులో ఉంచి లీసెస్టర్ లోని క్రోమర్ స్ట్రీట్ లో వదిలేశారు. ఈ సూట్ కేసును తెరిచి చూస్తే మహిళ మృతదేహం వెలుగుచూసింది.

భారత సంతతికి చెందిన కిరణ్ దాడియా అనే మహిళను హత్య చేసి ఆమె మృతదేహన్ని సూట్ కేసులో భద్రపర్చారు. ఈ సూట్ కేసును గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

indian origin woman's dead body found in hidden suitcase in uk

కిరణ్ దాడియా గత 17 ఏళ్ళ నుండి ఓ కాల్ సెంటర్ లో జాబ్ చేస్తోంది. ఆమె మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్ళింది. అప్పటి నుండి ఆమె ఇంటికి రాలేదు. కిరణ్ సోదరి జస్బీర్ కౌర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆఫీసుకు వెళ్ళేముందు ఆమె తనతో మాట్లాడిందని జస్బీర్ కౌర్ చెప్పారు. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కిరణ్ భర్త ఆశ్విన్ దాడియాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అదే ఏరియాలో ఇటీవల తప్పిపోయిన బ్రిటన్ మహిళ మృతదేహంగా భావించామని పోలీసులు అనుమానపడ్డారు. కాని, చివరకు కిరణ్ దాడియాగా గుర్తించారు. కిరణ్ భర్త ఆశ్విన్ కోర్టులో హజరుపర్చారు.అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+