భారత సంతతి యువతి లైంగిక వేధింపులు, జైలు

లండన్: తాను చేసిన నేరానికి ఓ భారత సంతతి యువతి జైలు శిక్ష అనుభవించక తప్పడం లేదు. బ్రిటన్‌లోని ఓ కేర్ హోం సెంటర్‌లో వృద్ధులకు సేవ కోసం నియమితురాలైన ఓ భారత సంతతి యువతి ఏకంగా వారిపై లైంగిక దాడులకు పాల్పడింది. అక్కడితో ఆగక తన లైంగిక చేష్టలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని తన బాయ్ ఫ్రెండ్‌కు పంపించి పైశాచిక ఆనందం పొందింది. ఈ చేష్టలకు ఆమె నిరుడు జనవరి, మే నెలల మధ్య పాల్పడింది.

భారత సంతతికి చెందిన 25 ఏళ్ల క్రిస్టియానా సేథీ అనే యువతి ఒక కేర్ హోంలో నర్సుగా పని చేసేది. వయో వృద్ధులైన ఓ పురుషుడు, ఇద్దరు మహిళలను లైంగింకంగా వేధించింది. వీరిలో 101 ఏళ్లపైబడిన వృద్ధురాలు కూడా ఉండటం గమనార్హం. 2014 జనవరి నుంచి ఈ ఏడాది మే నెల వరకు ఈ ఆకృత్యాలకు పాల్పడింది. ఆమె లైంగిక ఆగడాలకు ఒకరు మరణించారు.

మొబైల్ ద్వారా చిత్రీకరించిన లైంగిక వీడియోలను తన బాయ్ ఫ్రెండ్‌తో షేర్ చేసుకునేది. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసేది. అయితే అనుకోని రీతిలో ఆమె దారుణాలు వెలుగుచూశాయి. సేథీకి తెలిసిన వ్యక్తి ఆమె కంప్యూటర్‌ను కొనుగోలు చేశాడు. అందులో డిలీట్ చేసిన వీడియోలను అతడు రికవర్ చేశాడు. దీంతో అమ్మడి లైంగిక చేష్టలు బయటపడ్డాయి.

Indian-origin woman in UK jailed for sex assaults on elderly

సేథీ లైంగిక దాడులను భరించలేని ఓ వయో వృద్ధురాలు వేడుకున్నా ఆమె ఏ మాత్రం కనికరం చూపలేదు. ఇలాంటి వీడియోలు చూసి అతని మెదడు దిమ్మతిరిగిపోయింది. సేథీ లైంగిక దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.

ఈ కేసు విచారించిన జడ్జి కూడా సేథీ లైంగిక ఆకృత్యాలను చూసి నివ్వెరపోయాడు. వృద్ధులకు సేవ చేయాల్సింది పోయి వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు వారిని లైంగికంగా వేధించడం దారుణమైన విషయంగా పరిగణించాడు. తన సుఖం, సంతోషం కోసం వారిని బలిచేయడంపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెద్దలపై లైంగిక దాడులకు పాల్పడిన సేథీకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+