న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి..
అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు కలిగిన మరో నేత హాట్ టాపిక్ గా మారారు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమదానీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ర్యాంక్డ్ ఛాయిస్ కౌంటింగ్ ద్వారా ఆయన విజయం సాధించారు. ముఖ్యంగా మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆయన విజయం సాధించడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం అమెరికాలోనే కాకుండా భారత్ లో కూడా చర్చనీయాంశంగా మారింది.
కుటుంబ నేపథ్యం..
33 ఏళ్ల జోహ్రాన్ మమదానీ ఉగాండాలో భారత మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ చిత్ర దర్శకురాలు మీరా నాయర్. జోహ్రాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన కొన్ని హామీలు బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పొచ్చు. పిల్లల సంరక్షణ, ఉచిత బస్సు ప్రయాణం, సంపన్నులపై అధిక పన్నులు వంటి ప్రతిపాదనలు చాలా మందికి నచ్చాయి. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి డెమోక్రాటిక్ సోషలిస్టుల మద్దతు ఆయనకు బలాన్ని ఇచ్చింది.

అంతే కాకుండా సాధారణ రాజకీయ ప్రచారాలకు భిన్నంగా జోహ్రాన్ తన ప్రచారాన్ని సోషల్ మీడియాలో వినూత్నంగా నిర్వహిస్తున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, బాలీవుడ్ పాటలు, డైలాగులతో వీడియోలు చేసి యువతను ఆకట్టుకుంటున్నారు. ఎన్నారై (NRI) కమ్యూనిటీపై ప్రత్యేక దృష్టితో ఆయన ప్రచారం మరింత బలంగా నిలుస్తోంది. జోహ్రాన్ నవంబర్‌లో జరిగే ప్రధాన ఎన్నికల్లో గెలిస్తే, న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మరియు భారతీయ-అమెరికన్ వ్యక్తిగా చరిత్రలో నిలుస్తారు.
కాగా ఇప్పటి వరకు ప్రధానంగా నాలుగు పేర్లు న్యూయార్క్ మేయర్ రేసులో వినిపిస్తున్నాయి. వారిలో జోహ్రాన్ మమదానీ - డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థిగా ఉంటే.. కర్టిస్ స్లివా - రిపబ్లికన్ అభ్యర్థిగా ఉన్నారు. అలానే జిమ్ వాల్డెన్ - స్వతంత్ర అభ్యర్థి, ఎరిక్ ఆడమ్స్ - ప్రస్తుత మేయర్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో తలపడనున్నారు. అయితే మమదానీకి మిగిలిన అభ్యర్థుల కంటే ఎక్కువ ఆదరణ ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Billionaires ke paas already sab kuchh hai. Ab, aapka time aageya.
— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) June 4, 2025
Billionaires already have everything. Now, your time has come. pic.twitter.com/bJcgxzt37S












Click it and Unblock the Notifications