వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్‌లో 40 అశ్లీల చిత్రాలు: భారత పూజారి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: చైల్డ్ పోర్నోగ్రఫీని కలిగి ఉన్నాడనే ఆరోపణపై పోలీసులు అమెరికాలోని ఫ్లోరిడాలో 47 ఏళ్ల భారత పూజారిని అరెస్టు చేశారు. తన ఫోన్‌లో ఉన్న 40 అశ్లీల చిత్రాలను తొలగించాలని అతను 14 ఏళ్ల బాలుడిని అడిగినట్లు అధికారులు చెప్పారు.

అమెరికాకు వచ్చిన జోస్ పాలిమట్టోమ్ అనే ఆ భారత పూజారిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అశ్లీల చిత్రాలను కలిగి ఉన్నందుకు, వాటిని ఓ మైనర్‌కు పంపిణీ చేసినందుకు అతనిపై అభియోగాలు మోపారు. పది వేల డాలర్ల పూచీకత్తుపై బెయిల్ లభించే అవకాశం ఉన్న అతన్ని పామ్ బీచ్ కౌంటీ జైలులో ఉంచారు.

Indian Priest Arrested for Possessing Child Pornography

భారత పూజారికి నేరచరిత్ర ఏదీ లేదని నిర్ధారణ చేసుకున్నారు. చర్చిలో తన సేవలు ముగిసిన తర్వాత తన సెల్‌ఫోన్‌లో ఉన్న చైల్డ్ పోర్నోగ్రఫీని తొలగించాలని పాలిమట్టోన్ కోరినట్లు ఆరోపణలు వచ్చాయని పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ అధికార వర్గాలు చెప్పాయి.

మరో వయోజన వ్యక్తి లేకుండా మైనర్లతో సంబంధాలు పెట్టుకోబోనని తాను చేరినప్పుడు పాలిమట్టోన్ చెప్పినట్లు హోలీ కాథలిక్ చర్చి హెడ్ పాస్టర్ డిప్యూటీలతో చెప్పారు. పాలిమట్టోన్ చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.

English summary
A 47-year-old Indian priest has been arrested in the US state of Florida on charges of possessing child pornography, with authorities saying he asked a 14-year old boy to help him delete about 40 pornographic images of young boys from his phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X