అమెరికాలో భారతీయుడ్ని కాల్చి చంపిన 16 ఏళ్ల బాలుడు, టీనేజర్స్ అరెస్ట్
ఫ్లోరిడా: అమెరికాలో భారతీయుడు ఒకరు మంగళవారం దారుణంగా హత్యకు గురయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రం సెయింట్ అగస్ట్టైన్‌లోని ఒక స్టోర్‌లో గుమాస్త్గా పని చేస్తున్న మానవ్ దేశీ అనే భారతీయుడిని పదహారు ఏళ్ల బాలుడు కాల్చి చంపాడు.
దోపిడీ యత్నంలో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడితో పాటు మరో టీనేజర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. మానవ్ దేశ వివాహం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో దుర్ఘటన చోటు చేసుకుంది.

మానవ్ దేశీ కొద్ది రోజుల క్రితమే తన ఫియాన్సీతో కలిసి నార్త్ కరోలినా నుండి సెయింట్ అగస్టైన్‌కు తరలి వెళ్లారు. నిందితుడైన బాలుడు తన ముఖానికి హ్యాండ్ కర్చీఫ్ కట్టుకొని కాల్పులు జరిపాడని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఏప్రిల్ నెలలో దోపిడీ యత్నంలో భాగంగానే సంజయ్ పటేల్ అనే భారతీయుడిని దుండగులు కాల్చి చంపారు.


Click it and Unblock the Notifications