అమెరికాలో విద్యార్థుల అరెస్ట్: సాయం చేసేందుకు ముందుకొచ్చిన తెలుగు సంఘాలు
వాషింగ్టన్: ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి సహాయం చేసేందుకు ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్), నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంఘం) ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇవి ప్రకటన చేశాయి.
అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థులకు న్యాయ సాయం చేసేందుకు నాట్స్ ముందుకు వచ్చింది. నాట్స్ చైర్మన్, అధ్యక్షులు కలిసి అరెస్టుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.

మరోవైపు, అరెస్టైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆటా పేర్కొంది. భారత్ నుంచి ఎంతోమంది అమెరికా వస్తుంటారని, చట్టం ప్రకారం అంతా సక్రమంగానే జరుగుతుందని చెప్పారు. అమెరికా రావాలనుకునే వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు.
కాగా, అమెరికాలో అక్రమ వలసదారుల్ని గుర్తించటంలో భాగంగా సెక్యూరిటీ అధికారులు ఇమ్మిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్లపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉంటున్నట్లుగా గుర్తించారు.
దాదాపు ఆరు వందల మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చేందుకు సహకరించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీసా కాలపరిమితి ముగిసినప్పటికీ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎక్కువగా తెలుగు వారు ఉన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications