భారతీయ విద్యార్ధులకు అమెరికా వార్నింగ్. అతి చేస్తే జైలుకే
స్టూడెంట్ వీసాలపై వచ్చిన వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల అమెరికాలో పెరుగుతున్న క్రైం రేటుకు బయట దేశాల నుంచి వచ్చిన వారి పాత్ర కూడా ఎక్కువగా ఉందని.. చదువుకోవడానికి వచ్చిన వారు చదువు తప్పా మిగతా వ్యవహారాలు అన్ని చేస్తున్నారని అమెరికా ఎంబసీ భావించింది. ఈ నేపథ్యంలో స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా వీసా అంటే స్వేచ్ఛ కాదు.. గౌరవం అని అభివర్ణించింది.
స్టూడెంట్ వీసా పొందిన విద్యార్థులు అమెరికా చట్టాలు, రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని ఎంబసీ స్పష్టం చేసింది. ఉల్లంఘిస్తే ఉపేక్షించే ది లేదని గట్టిగా హెచ్చరించింది అమెరికా రాయబార కార్యాలయం. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చదువుతున్న వారు, చదవడానికి వెళ్లబోతున్న విదేశీ విద్యార్థులందరూ అక్కడి చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించాలని సూచించింది. ముఖ్యంగా F-1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు తమ వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది.

మెరికా చట్టాలను లేదా వీసా షరతులను ఉల్లంఘించినట్లయితే వీసాను తక్షణమే రద్దు చేయడం, బలవంతంగా స్వదేశానికి పంపించడం (డిపోర్టేషన్) వంటి చర్యలు తీసుకుంటామని ఎంబసీ స్పష్టం చేసింది. అంతేకాదు, భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేయకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. తీవ్రమైన ఉల్లంఘనలైతే అమెరికాలోకి శాశ్వతంగా ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశమూ ఉందని తెలిపింది.
Breaking U.S. laws can have serious consequences for your student visa. If you are arrested or violate any laws, your visa may be revoked, you may be deported, and you could be ineligible for future U.S. visas. Follow the rules and don’t jeopardize your travel. A U.S. visa is a… pic.twitter.com/A3qyoo6fuD
— U.S. Embassy India (@USAndIndia) January 7, 2026
ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనల అమలులో మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. స్టూడెంట్ వీసాలకే కాకుండా వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాల విషయంలోనూ కఠిన తనిఖీలు, నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా పని చేయడం, వీసా గడువు దాటిపోవడం, అనుమతి లేని కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాలతో అనేక మంది విదేశీయులను ఇప్పటికే అమెరికా నుంచి పంపివేసిన ఘటనలు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరిక భారతీయ విద్యార్థులకు అత్యంత కీలకంగా మారింది. కేవలం చదువుపై మాత్రమే కాకుండా, అక్కడి చట్టాలు, స్థానిక నిబంధనలు, వీసా షరతులపై కూడా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న స్పష్టమైన సందేశాన్ని ఈ హెచ్చరిక ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
-
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్‌పై ట్రంప్ సంచలన ప్రకటన! -
యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా పుతిన్! ట్రంప్‌తో సీక్రెట్ ప్లాన్? -
అట్టుడికిపోతున్న టెహ్రాన్.. ఆయిల్ రిఫైనరీ కేంద్రాలపై దాడులతో ఇంధనం ధరలకు రెక్కలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications