ప్రాణం తీసిన గ్రీన్‌కార్డు: అమెరికాలో తెలుగు యువకుడి బలవన్మరణం, భార్య గర్భవతి..
తెలుగువ్యక్తి శివ చలపతిరాజు అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్యకు గ్రీన్‌కార్డు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. చలపతిరాజు మృతితో నార్త్ కరోలినాలోని అతని స్నేహితులు, తెలిసినవాళ్లు దు:ఖసాగరంలో మునిగిపోయారు.
నార్త్ కరోలినాలో శివ చలపతిరాజు దంపతులు నివసిస్తున్నారు. అతని భార్య సౌజన్య గర్భవతి కూడా. అయితే అతని భార్యకు గ్రీన్ కార్డు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. సౌజన్య గర్భవతి కావడం.. ఆమెను తిరిగి ఇండియా పంపించాల్సి రావడంతో మనస్తాపానికి గురయ్యాడు.

ఈ అంశంపై తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అపస్మారకస్థితిలోకి వెళ్లి చనిపోయాడు. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నారు. అమెరికాలో అతని బంధువులు, తెలిసినవాళ్లు గ్రీన్‌కార్డుతో ఉంటున్నారు. రాజు గ్రీన్‌కార్డు రాకపోవడంతో బాధపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య సౌజన్యను తప్పకుండా ఇండియా పంపించి రావడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
నార్త కరోలినాలోని హై పాయింట్ వద్ద ఒరాకిల్ డెవలపర్‌గా రాజు పనిచేస్తున్నారు. ఇదివరకు విప్రో, బ్రిటిష్ పెట్రోలియం కంపెనీల్లో పనిచేశారు. మిచిగాన్, ఇల్లినాయిస్‌లో ఆయా సంస్థల్లో విధులు నిర్వర్తించారు. రాజు మృతిపై ప్రవాస భారతీయులు సంతాపం వ్యక్తం చేశారు. అతని స్నేహితులు దు:ఖసాగరంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications