గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తే జైలుకు పంపారు.. అమెరికాలో భారతీయ మహిళ అరెస్ట్
అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న భారత సంతతి మహిళ బబ్లీజీత్ కౌర్(60) ను అధికారులు అరెస్ట్ చేశారు. తన గ్రీన్ కార్డు బయోమెట్రిక్ కోసం ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లిన ఆమెను ICE ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రాత్రికి రాత్రే అడెలాంటో డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. ఈ విషయాన్ని కౌర్ కుమార్తె జ్యోతి తెలిపారు. అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై లాంగ్ బీచ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కౌర్ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ఆమె విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.
భారత్ సంతతికి చెందిన 60 ఏళ్ల బబ్లీ జీత్ కౌర్ అనే మహిళను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గ్రీన్ కార్డు ప్రక్రియ కోసం వెళ్లిన ఆమెను ఐస్ (ICE) ఏజెంట్లు బంధించి అడెలాంటో డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కౌర్ 1994 నుంచి అమెరికాలో చట్ట బద్ధంగా నివాసం ఉంటున్నారు. ఆమె భర్త కూడా గ్రీన్ కార్డు హోల్డర్ అని లాంగ్ బీచ్ వాచ్ డాగ్ సంస్థ వెల్లడించింది.
బబ్లీ కౌర్ కుమార్తె జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన డిసెంబర్ 1 జరిగినట్లు తెలుస్తోంది. గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాల కోసం బబ్లీ కౌర్.. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడికి వచ్చిన కొందరు ఫెడరల్ ఏజెంట్లు తన తల్లిని అరెస్ట్ చేశారని.. కారణం చెప్పకుండా అదుపులోకి తీసుకున్నారని కౌర్ కుమార్తె జ్యోతి తెలిపారు. ఈ విషయంపై తన తల్లి.. అటార్నీతో ఫోన్ కాల్ లో మాట్లాడినా.. ఆమెను డిటెన్షన్ చేశారని అన్నారు. రాత్రికి రాత్రే అడెలాంటో డిటెన్షన్ సెంటర్ కు తరలించారని తెలిపారు. అక్కడ ఓ పెద్ద గదిలో ఇతర ఖైదీలతోపాటుగా ఉంచారని.. వయోభారం రిత్యా ఆమె ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కౌర్ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ఆమె విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన కార్యాలయం పేర్కొంది. ఇక బబ్లీ కౌర్ దంపతులు గత 20 ఏళ్లుగా లాంగ్ బీచ్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. స్థానికులకు ఎంతో సుపరిచితం అయ్యారు. అంతకుముందు 25 ఏళ్లపాటు ఆమె ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications