తుపాకీ చూపించిన దొంగతో భారత మహిళ ఫైట్(వీడియో)
న్యూయార్క్: ఏ దొంగైనా తుపాకీ చూపించి డబ్బులు డిమాండ్ చేస్తే ఎవరైనా ఏం చేస్తారు. ఇంకేముంది తమ దగ్గర ఉన్న సొమ్మంతా అతనికి ఇచ్చేస్తారు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం ఇలాంటి ఘటనలో ఓ భారత మహిళ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది.
తుపాకీ చూపించిన దొంగకు బెదరకుండా.. అతనిని ధైర్యంగా ఎదుర్కొంది. అంతేగాక, అతనిపై దాడి చేసి పట్టుకునేందుకు ప్రయత్నించింది. అనూహ్యంగా ఎదురైన పరిణామానికి హతాశుడైన దొంగ కాళ్లకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని కీస్‌విల్లేలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కీస్‌వెల్లేలోని ఓ కిరాణా దుకాణంలో భూమిక పటేల్ అనే భారతీయ మహిళ క్యాషియర్‌గా పనిచేస్తోంది. 17 ఏళ్ల క్రిస్టియన్ డకోటా.. ఆమె పనిచేస్తున్న దుకాణంలో దొంగతనానికి యత్నించాడు. తుపాకీని పాయింట్ బ్లాక్‌లో పెట్టి డబ్బు ఇచ్చేయమంటూ బెదిరించాడు. కానీ భూమిక వాడి బెదరింపులకు బెదిరిపోలేదు.
'నన్ను కాలుస్తావా.. సరే కాల్చేయ్' అంటూ ఎదురుదాడి చేసింది. తుపాకీని బేఖాతరు చేస్తూ చేతికందిన వస్తువుతో చితకబాదింది. వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన భూమిక పటేల్ ఇప్పుడు స్థానికంగా పెద్ద ఐకాన్ అయ్యారు. ఆమె గురించి స్థానిక మీడియా గొప్పగా కథనాలు ప్రచురిస్తోంది. ఆమె దొంగను చితకబాదిన సీసీటీవీ కెమెరా వీడియో ఫుటేజీని స్థానికులు ప్రత్యేకంగా వచ్చి తిలకిస్తున్నారు. ఆమె ధైర్య సాహసాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications