‘ఇండియన్ వర్కర్స్ చెత్తగాళ్లు’: మైన్ గవర్నర్ పైత్యం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసం వివిధ పార్టీల తరపున పోటీ పడుతున్న అభ్యర్థులు భారత్, భారతీయులపై ఉన్న అక్కసును ఎన్నికల ప్రచారంలో వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కుతున్న విషయం తెలిసిందే.
తాజాగా, అమెరికాలో మరో రిపబ్లికన్ నేత భారతీయులపై నోరుజారారు. భారతీయ కార్మికులను అర్థం చేసుకోవడం అత్యంత దుర్లభమని మైన్ రిపబ్లికన్ గవర్నర్ పాల్ లిపేజ్ వ్యాఖ్యానించారు. వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన లిపేజ్... మైన్ రిపబ్లికన్ల సదస్సులో ఆదివారం మాట్లాడారు.

'భారతీయ ఉద్యోగులు చెత్తగాళ్లు.. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారితో మాట్లాడాలంటే అనువాదకుడు ఉండాల్సిందే' అని అన్నాడు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు రావడంతో ఆయన తేరుకుని సారీ చెప్పారు. భారత్ గొప్ప దేశమంటూ కొనియాడారు.
భారతీయులు ప్రియమైనవారని కూడా లిపేజ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రిపబ్లికన్ల తరఫున ముందంజలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ భారతీయులను లక్ష్యంగా చేసుకొని కాల్‌సెంటర్లను అవహేళన చేస్తూ శనివారం మాట్లాడిన సంగతి తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications