'వట్టిదే! నన్నెందరో ఆడవాళ్లు ఇష్టపడ్తారు, సెక్స్ అవసరం లేదు'
వాషింగ్టన్: భారతీయ యోగా గురు బిక్రమ్ చౌదరి తన పైన వచ్చిన అత్యాచార ఆరోపణలను తోసిపుచ్చారు. అతని పైన ఆరుగురు యువతులు సెక్సువల్ వేధింపుల ఆరోపణలు చేశారు. దీని పైన అతను ఓ ఇంటర్వ్యూలో స్పందించినట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రజలకు, ప్రపంచానికి నిజం చెప్పాలనుకుంటున్నానని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఎవరిని లైంగికంగా వేధించలేదన్నారు. తనకు ఎవరినీ లైంగికంగా వేధించాలనే ఉద్దేశ్యం లేదని చెప్పారు. తనకు సెక్స్ కావాలనుకుంటే చాలామంది నుండి ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు.
తనను చాలామంది మహిళలు ఇష్టపడతారని, ప్రేమిస్తారని చెప్పారు. నిజంగానే తనకు అలాంటి ఉద్దేశ్యం ఉంటే.. ఎవరినీ వేధించవలసిన అవసరం లేదని చెప్పారు. తన పైన ఆరోపణలు చేసిన వారిని చూసి తాను జాలి పడుతున్నానని చెప్పారు.

తనకు వారి పైన ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. వారు చెడ్డవారు అని తాను భావించడం లేదని, వారి వెనుక ఎవరో ఉండి ఇలా చేయిస్తున్నారని తాను భావిస్తున్నానని చెప్పారు. తన పైన వచ్చిన ఆరోపణలను ఆయన పదేపదే కొట్టిపారేశారు. అంతేకాకుండా, తనకు వారితో ఎలాంటి లైంగిక సంబంధం లేదని తేల్చి చెప్పారు.
కాగా, బిక్రమ్ చౌదరికి ముప్పై ఏళ్ల క్రితం పెళ్లైంది. అతను మాట్లాడుతూ.. తనకు ఏ మహిళతోను, ఏ విద్యార్థినితోను సెక్స్ చేయాలనే ఆలోచన లేదని చెప్పారు. కొందరు తాను శృంగారంలో పాల్గొనకుంటే.. విపరీత సంఘటనలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications