Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తగ్గేదేలే..! ఈయూ ఆంక్షలపై తేల్చేసిన భారత్..! మోడీ బ్రిటన్ టూర్ వేళ..!

రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ పై ఐరోపా సమాఖ్య విధించిన ఆంక్షలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రష్యా చమురు దిగుమతి చేసుకుంటూ ఆ దేశానికి ఆర్ధికంగా అండగా నిలుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ పై ఈయూతో పాటు నాటో, అమెరికా గుర్రుగా ఉన్నాయి. ఇదే అదనుగా గుజరాత్ లో ఉన్న రష్యా భాగస్వామ్య నయారా చమురు శుద్ది కర్మాగారంపై ఈయూ ఆంక్షలు విధించింది. దీనిపై భారత్ ఇవాళ మరోసారి తీవ్రంగా స్పందించింది.

రష్యా చమురు దిగుమతుల విషయంలో తమ దేశం పాశ్చాత్య దేశాల ఒత్తిడి కంటే తమ ఇంధన భద్రతకే ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తేల్చిచెప్పేశారు. తద్వారా ఈయూ ఆంక్షల ఒత్తిడికి లొంగబోమని స్పష్టం చేశారు. భారతదేశం తన జనాభాకు నమ్మకమైన, చౌక అయిన చమురును దిగుమతి చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి పేర్కొన్నారు.

india s stern reaction to EU sanctions over russian oil import ahead of pm modi s UK visit

గతవారం గుజరాత్ లోని నయారా చమురు శుద్ధి కర్మాగారంపై ఈయూ ఆంక్షల తర్వాత ఇంకా రష్యా చమురు దిగుమతులు కొనసాగిస్తే ఆర్ధిక జరిమానాలు, భారీ సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంధన భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతగా ఉందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తేల్చిచెప్పారు. ఆ విషయంలో మనం ఏమి చేయాలో అది చేస్తామంటూ ప్రకటించారు.

అలాగే ప్రపంచ ఇంధన విధాన రూపకల్పనలో పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలను మిస్రీ ప్రశ్నించారు. ప్రపంచ పరిస్థితి ఏంటో స్పష్టంగా దృష్టి పెట్టాలని ఆయా దేశాల్ని కోరారు. అస్తిత్వ సమస్యలు , ఇంధన అవసరాలు యూరప్‌ను ప్రభావితం చేసినట్లే మిగిలిన ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. తద్వారా ప్రధానమంత్రి మోడీ బ్రిటన్ పర్యటన వేళ ఈయూ ఆంక్షల విషయంలో తమ వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లయింది.

india s stern reaction to EU sanctions over russian oil import ahead of pm modi s UK visit

ఈయూ తాజా ఆంక్షల వల్ల రష్యా ముడి చమురు నుండి శుద్ధి చేసిన ఇంధన రవాణా ప్రభావితం కానుంది. రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై అమెరికా సుంకాలు పెంచే అవకాశాలున్నాయి. రష్యన్ ముడి చమురు నుండి తయారయ్యే ఇంధన ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేస్తుంది. రష్యా చమురు ఎగుమతులకు ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. భారత్ తో పాటు రష్యా కంపెనీలకు భాగస్వాములుగా ఉన్న దేశాల్ని టార్గెట్ చేస్తారు. ఇందులో బ్యాంకింగ్ ఆంక్షలు కూడా ఉంటాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్ భద్రతా సమస్యల్ని అంగీకరిస్తున్నా.. పశ్చిమ దేశాల వెలుపల ఉన్న దేశాల చట్టబద్ధమైన ఇంధన అవసరాలను మాత్రం వారు గుర్తించాలని భారత్ కోరుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+