పెళ్లి ఎప్పుడు అని అడిగినందుకే?..: పక్కింటి మహిళపై యువకుడి దారుణం..

Subscribe to Oneindia Telugu

జకర్తా: పెళ్లి ఎప్పుడని ప్రశ్నించిన పాపానికి ఏకంగా హత్య చేసేశాడు ఓ ప్రబుద్దుడు. పక్కింటబ్బాయి కదా అన్న చనువుతో.. అతన్ని ఆటపట్టించడానికో.. సరదాకో.. ఆమె పదేపదే అతన్ని పెళ్లి గురించి అడిగేది. ఎప్పుడూ లేనిది ఇటీవల పెళ్లి గురించి అడగగానే చిర్రెత్తిపోయిన ఆ యువకుడు ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.

 పెళ్లి ఎప్పుడని..:

పెళ్లి ఎప్పుడని..:

ఇండోనేషియాకి చెందిన ఫాయిజ్‌.. కాంపుంగ్‌ పసిర్‌ జొంగ్‌ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఐస్యా అనే 32ఏళ్ల వివాహిత అతని ఇంటిపక్కనే ఉంటోంది. ఫాయిజ్‌తో మాట్లాడినప్పుడల్లా.. ఇంకెప్పుడు పెళ్లి అని ప్రశ్నించేది. నీ వయసు వాళ్లకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి అని గుర్తుచేసేది.

 ఆమెను హత్య చేసిన ఫాయిజ్:

ఆమెను హత్య చేసిన ఫాయిజ్:

ఐస్యా ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ఫాయిజ్ పెళ్లి గురించి పెద్దగా స్పందిచేవాడు కాదు. దీంతో పదేపదే ఆమె అతన్ని దాని గురించే అడుగుతుండేది. గత నెల 19న కూడా ఐస్యా ఫాయిజ్‌ను పెళ్లి గురించి ప్రశ్నించింది. దీంతో సహనం కోల్పోయిన ఫాయిజ్.. ఆమెపై దాడి చేసి హత్య చేశాడు.

 డబ్బుతో పరారీ..:

డబ్బుతో పరారీ..:

హత్యానంతరం ఆమె వద్ద నుంచి డబ్బు, మొబైల్‌ ఫోన్‌ను తీసుకొని జకార్తాకు పరారయ్యాడు. అతనిపై నిఘా పెట్టిన పోలీసులు.. జకార్తాలో అతను తలదాచుకుంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లగానే అతను పారిపోయేందుకు యత్నించగా.. ఓ పోలీస్ అతని కాలుకు గురిచూసి కాల్చాడు. దీంతో ఫాయిజ్ అక్కడే కుప్పకూలాడు.

 జీవితఖైదు పడొచ్చు..

జీవితఖైదు పడొచ్చు..

నేరం అంగీకరించిన ఫాయిజ్‌ను ఇటీవలే అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఇండోనేషియా చట్టాల ప్రకారం.. నిందితుడికి జీవితఖైదు పడే అవకాశం ఉందంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When are you getting married?” is a question that plagues many, mostly those in the their late 20s and early 30s.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి