సంచలన నిర్ణయం: 'డ్రగ్స్ సరఫరా చేస్తే కాల్చి పారేయండి'
అరెస్టులను అడ్డుకునే విదేశీ డ్రగ్ డీలర్లను కాల్చి పారేయండని ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో పోలీసులకు సూచించారు.
ఇండోనేషియా: అరెస్టులను అడ్డుకునే విదేశీ డ్రగ్ డీలర్లను కాల్చి పారేయండని ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో పోలీసులకు సూచించారు.
డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అరెస్టును అడ్డుకునే డ్రగ్ సరఫరాదారులను కాల్చిపారేయండని పోలీసులను ఆదేశించారు.

ఓ స్థానిక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రగ్ డీలర్స్ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినవారు అరెస్టును అడ్డుకుంటే వారిని కాల్చేయాలని, ప్రస్తుతం మనం డ్రగ్స్‌ను నిర్మూలించాల్సిన అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు.
గతవారం డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు యత్నిస్తున్న తైవాన్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. సదరు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో పోలీసులు కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు జోకో తాజా నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications