వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాపింగ్ బ్యాగ్ ఛాలెంజ్.. హాట్ హాట్‌గా బోల్డ్ గాళ్స్.. మతిపోగొట్టే అందాలు..

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాల్లో లాక్ డౌన్ పీరియడ్ నడుస్తోంది. కోట్లాది మంది జనం ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే ఖాళీగా కాలం వెల్లబుచ్చాలంటే చాలామందికి ఉబుసుపోవట్లేదు. ముఖ్యంగా నెల క్రితం వరకు షూటింగ్స్‌తో బిజీగా గడిపిన నటీనటులకు,ఫోటోషూట్స్‌తో బిజీగా గడిపిన మోడల్స్‌కు కరోనా కాలాన్ని ఎలా నెట్టుకురావడం కష్టంగా మారింది. అందుకే కొత్త కొత్త ఛాలెంజ్‌లతో లేదా షార్ట్ ఫిలింస్‌తో తమ క్రియేటివిటీకి పనిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు ఇవేమి దిక్కుమాలిన ఛాలెంజ్‌లు అంటూ సామాన్యుల నుంచి వాటిపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సరే ఎవరేమనుకున్నా.. ఈ ఛాలెంజ్‌ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. నిన్న మొన్నటిదాకా ఫ్యాషన్ ప్రపంచంలో 'క్వారెంటైన్ పిల్లో ఛాలెంజ్' హల్‌చల్ చేసింది. ఇప్పుడు కొత్తగా 'షాపింగ్ బ్యాగ్ ఛాలెంజ్' పుట్టుకొచ్చింది.

ఏంటీ షాపింగ్ బ్యాగ్ ఛాలెంజ్..

పిల్లో ఛాలెంజ్ లాంటిదే షాపింగ్ బ్యాగ్ ఛాలెంజ్ కూడా. సాధారణంగా మనం షాపింగ్‌ చేసినప్పుడు క్యారీ బ్యాగ్స్ ఇస్తుంటారు కదా. ఆ క్యారీ బ్యాగ్స్‌నే దుస్తులుగా ధరించడం ఈ కొత్త ఛాలెంజ్ ఉద్దేశం. చాలామంది మోడల్స్ ఈ ఛాలెంజ్‌ను ఇప్పటికే స్వీకరించారు. ఒంటిపై దుస్తులేవీ లేకుండా కేవలం షాపింగ్ బ్యాగ్‌ను మాత్రమే ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. వాటిని తమ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ పేరుతో...

లాక్ డౌన్ పీరియడ్‌లో ఇంట్లో చిక్కుకుపోయినంత మాత్రానా.. ఫ్యాషన్‌ ట్రెండ్‌ను ఆపేయాలా అని చాలామంది భావిస్తున్నారు. ఇంట్లోనే క్రియేటివిటీకి పదునుపెడుతూ ఫ్యాషన్‌ను కొత్త పుంతలు తొక్కించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పిల్లో ఛాలెంజ్,షాపింగ్ బ్యాగ్ ఛాలెంజ్‌లు పుట్టుకొచ్చాయి. షాపింగ్ బ్యాగ్ ఛాలెంజ్‌లో క్యారీ బ్యాగ్స్‌నే ఒక డ్రెస్ తరహాలో మార్చి ధరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న ఈ హాట్ ఫోటోలు కుర్రాళ్ల మతులు పోగొట్టేలా ఉన్నాయి.

Recommended Video

AP Lockdown Relaxations Guidelines || కరోనా లక్షణాలు లేకపోతేనే ఈ మినహాయింపులు...!!

నిన్నటిదాకా పిల్లో ఛాలెంజ్..

ఇక నిన్నటిదాకా ట్రెండింగ్‌లో ఉన్న పిల్లో ఛాలెంజ్‌లోనూ చాలామంది మోడల్స్,భామలు కేవలం పిల్లోనే ధరించి హాట్ హాట్ పోజులిచ్చారు. పిల్లోకి మధ్యలో ఓ బెల్ట్ అమర్చి.. అదే పిల్లోను తమ ముందు భాగం కవరయ్యేలా ధరించి బెల్టు పెట్టేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు చాలానే పోటెత్తాయి.

English summary
Just when ‘quarantine pillow challenge’ seems to be getting over, a new sartorial craziness called ‘shopping bag challenge’ is taking over Instagram by storm as we stay home during the Covid-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X