Instagramdown: స్తంభించిన ఇన్‍స్టాగ్రామ్.. ఇబ్బందుల్లో వినియోగదారులు..
మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‍స్టాగ్రామ్ డౌన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది వినియోగదారులు ఇన్ స్టాగ్రామ్ వినియోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్ స్టాగ్రామ్ పని చేయడం లేదని చాలా మంది ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీంతో #instagramdown ట్రెండింగ్ లో నిలిచింది.
శుక్రవారం ఇన్ స్టాగ్రామ్ ఉపయోగించిన వినియోగదారులకు 'క్షమించండి, ఫీడ్‌ని రిఫ్రెష్ చేయలేకపోయింది', 'ఏదో తప్పు జరిగింది' వంటి ఎర్రర్ మెసేజ్‌లను చూపించింది. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. యూజర్లు ఇన్ స్టాగ్రామ్ లాగిన్ అవ్వడం, ఫోటో, వీడియో షేరింగ్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్ డిటెక్టర్ నివేదిక పేర్కొంది.

కానీ కనీసం 2 లక్షల వరకు యూజర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నట్లు తెలిసింది.మే 22న కూడా చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు. నివేదికల ప్రకారం, వినియోగదారులు తమ ఖాతాలకు లాగిన్ చేస్తున్నప్పుడు సమస్యను ఎదుర్కొన్నారని, వారి ఫీడ్‌లను యాక్సెస్ చేయలేకపోయారని చెప్పారు.
వారిలో కొందరు పోస్ట్ చేసేటప్పుడు కూడా సమస్యలను ఎదుర్కొన్నారు. అంతరాయం కారణంగా ప్రభావితమైన వినియోగదారుల సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com యునైటెడ్ స్టేట్స్‌లో 100,000 కంటే ఎక్కువ, కెనడాలో 24,000, బ్రిటన్‌లో 56,000 కంటే ఎక్కువ ఇన్ స్టాగ్రామ్ ఉపయోగించడంలో ఇబ్బంది పడ్డారు.












Click it and Unblock the Notifications