ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్: హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఒకే ఒక కండీషన్!

హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సముద్ర మార్గం తమ అధికార పరిధిలో ఉందని ఇరాన్ వాదిస్తుండగా.. హార్ముజ్ నుంచి ఇరాన్ ను తొలగించాలని అమెరికా పట్టుబడుతోంది. హార్ముజ్ జలసంధికి అమెరికా సంరక్షకురాలని.. దానిని ఎలాగైనా తెరుస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దురాక్రమణ ద్వారా హార్ముజ్ జలసంధిని తెరవగలమని భావిస్తే.. అది ఎప్పటికీ జరగదని అర్థం చేసుకోవాలని ఇరాన్ సైన్యం పేర్కొంది. హార్ముజ్ గుండా జరిగే రాకపోకలను తామే నియంత్రిస్తామని.. ఏ బాహ్యశక్తిని జోక్యం చేసుకోనివ్వమని ఇరాన్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

అమెరికాను దురాక్రమణ ద్వారా హార్ముజ్ జలసంధిని తెరవనివ్వబోమని ఇరాన్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమినియా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సముద్ర మార్గానికి సంబంధించి మా షరతుల నుంచి ఎప్పటికీ వెనక్కీ తగ్గమని.. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించడమే హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. "హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఉన్న ఏకైక షరతులు ఇరాన్ హక్కులను గౌరవించడం, ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండటం. ఒత్తిడి లేదా సైనిక బెదిరింపుల ద్వారా బలవంతంగా రుద్దిన ఏ ఏర్పాటునూ టెహ్రాన్ అంగీకరించదు." అంటూ ఆయన స్పష్టం చేశారు.

Iran Army Strong Counter to Donald Trump One Strict Condition to Reopen the Strategic Strait of Hormuz

ఇరాన్ ప్రయోజనాలను పరిరక్షించడం కొనసాగిస్తాం: అక్రమినియా
టెహ్రాన్‌లో బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమినియా మాట్లాడుతూ.. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సాయుధ దళాలు దేశ ప్రయోజనాలను కాపాడుతూ, ఇరాన్ హక్కుల కోసం పోరాడటం కొనసాగిస్తాయని అన్నారు. ఇరాన్ ప్రతిపాదించిన ఏర్పాట్లను అంగీకరించినప్పటికీ.. అమెరికా ఆ తర్వాత హార్ముజ్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టించడానికి ప్రయత్నించిందని, ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని ఆయన అన్నారు. హార్ముజ్ జలసంధి గుండా రవాణా ఎలా సాగాలనే నిర్ణయాన్ని ఇరాన్ సైన్యమే తీసుకుంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరాన్ సైన్యం ఏర్పాటు చేసిన చట్రానికి వెలుపల హార్ముజ్ జలసంధిలో ఎలాంటి ఏర్పాటుకైనా ఇరాన్ గట్టిగా ప్రతిస్పందిస్తుంది. అమెరికా ఒత్తిడితో హార్ముజ్ జలసంధిని తెరవబోమని ఆయన డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు.

డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే?
హార్ముజ్ జలసంధిలో ఇరాన్‌పై మరోసారి నావికా దిగ్బంధనాన్ని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుండటంతో ఆ మార్గాన్ని రక్షించే బాధ్యతను అమెరికా తీసుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ రక్షణ కోసం 20 శాతం టోల్ చెల్లించాలని స్పష్టం చేశారు. అమెరికా ఇకపై హార్ముజ్ జలసంధికి సంరక్షకురాలిగా వ్యవహరిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రటించారు. ఆ మార్గం గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకలోని సరుకు విలువపై 20 శాతం పన్ను చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఆ వసూళ్లను అక్కడ భద్రతా ఖర్చుల కోసం ఉపయోగిస్తామన్నారు.

డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ తిరస్కరించింది. హార్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని.. భవిష్యత్తులో కూడా ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అమెరికా సైనిక దాడుల కారణంగానే హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ (PGSA) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా సైన్యం ఇటీవలి దురాక్రమణ చర్యల కారణంగా, ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణం సాధ్యం కాదని ఆ ప్రకటనలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+