ఇజ్రాయెల్ పై బాహుబలి మిసైల్ 'కోరమ్ షహర్' ను ప్రయోగించిన ఇరాన్.. ఊహకందని విధ్వంసం..!

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఈ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా ప్రవేశించింది. ఇరాన్‌ కు చెందిన 3 ప్రధాన అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఇరాన్‌ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌ అణు కేంద్రాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ కు చెందిన ప్రతిష్టాత్మక మిసైల్ గా భావించే కోరమ్ షహర్-4 ను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది.

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రత్యక్షంగా అమెరికా పాల్గొనడంపై ఇరాన్ లో ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి. ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా.. వాటిని ధ్వంసం చేయడంతో ఇజ్రాయెల్ పై భీకర స్థాయిలో విరుచుకు పడింది ఇరాన్. ఈ క్రమంలో బాహుబలి మిసైల్ గా పేరొందిన కోరమ్ షహర్-4 మిసైల్ ను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది ఇరాన్.

ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైనదిగా కోరమ్ షహర్-4 కు పేరుంది. ఈ మిసైల్ ను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది ఇరాన్. అంతేకాక మరో 40 మిసైల్స్ ను ఏకధాటిగా ఇజ్రాయెల్ లోని పలు కీలక స్థావరాలపై ప్రయోగించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టు, లాజిస్టిక్స్ హబ్స్, కమాండ్ కంట్రోల్ భవనాలు నేలమట్టం అయినట్లు తెలిపింది.

కోరమ్ షహర్-4 ప్రత్యేకతలు..

ఈ మిసైల్ ను ఇరాన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ రూపొందించింది. ఇది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. 2017, 2019 లో జరిగిన ఇరాన్ మిలిటరీ పరేడ్ లో వీటిని తొలిసారిగా ప్రదర్శించారు. దీని స్పీడు మ్యాక్ 18 గా ఉంది. 1800 కిలోల పే లోడ్ ను ఈ మిసైల్ మోసుకెళ్ల గలదు. దాదాపు 2000 కిలోమీటర్ల వరకు ఈ మిసైల్ దాడులను చేయవచ్చు.

Iran Claims Khorramshahr-4 Missile Strike on Israel Amid Escalating Conflict

మరోవైపు అమెరికా సైతం ఇరాన్ పై దాడులు చేస్తోన్న క్రమంలో ప్రపంచ దేశాలకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేసేందుకు సిద్దం అవుతోంది. ఏ క్షణమైనా ఇరాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో హార్మోజ్ జల సంధిని మూసివేస్తాం అని ఇరాన్ ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+