ఇజ్రాయెల్ అండర్ అటాక్- ప్రధాన నగరాల్లో విధ్వంసం

గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా ఆ దేశ ప్రధాన టెహ్రాన్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులను సాగిస్తోంది. మిస్సైళ్లతో విధ్వంసాన్ని సృష్టిస్తోంది.

రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి.

Iran fires atleast 200 ballistic missiles at Israel

ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులకు Raising Lion అని పేరు పెట్టింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత తొలి దాడి చోటు చేసుకుంది. జనావాసాలను కూడా లెక్కపెట్టట్లేదని ఇరాన్ మీడియా తెలిపింది.

ఈ దాడుల్లో- అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ మరణించినట్లు తెలుస్తోంది. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా దుర్మరణం పాలైనట్లు టస్మిన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ డిపోలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది టస్మిన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

దీనికి ప్రతీకారానికి దిగింది ఇజ్రాయెల్. ఇరాన్ నగరాలపై భారీగా బాలిస్టిక్ మిస్సైళ్లను సంధించింది. దాదాపుగా 200కి పైగా క్షిపణులను ప్రయోగించింది. అర్ధరాత్రి నుంచి రెండు విడతల్లో ఈ దాడి సాగింది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలు.. టెల్ అవివ్, జెరూసలేంను టార్గెట్ గా చేసుకుంది.

ఈ దాడుల్లో టెల్ అవీవ్ భారీగా నష్టపోయింది. బాలిస్టిక్ క్షిపణులు ఢీకొనడం వల్ల పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఓ కమ్యూనికేషన్ టవర్ దెబ్బతింది. ఇజ్రాయెల్‌ ఉత్తర ప్రాంతంలో ఓ నివాసం పూర్తిగా కూలిపోయింది. మంటలు చెలరేగాయని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది.

ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 22 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర వైద్య- విపత్తు- అంబులెన్స్ అండ్ బ్లడ్ బ్యాంక్ సర్వీస్ చీఫ్ మాగెన్ డేవిడ్ అడోమ్ తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. భవన శిథిలాల నుంచి వారిని రక్షించినట్లు చెప్పారు.

ఈ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధృవీకరింది. టెల్ అవివ్ లో మొత్తం తొమ్మిది ప్రదేశాలను ఈ మిస్సైళ్లు ఢీ కొట్టినట్లు తెలిపింది. మిగిలిన వాటిని మధ్యలోనే కూల్చివేసినట్లు పేర్కొంది. జనావాసాలపై క్షిపణులను ప్రయోగించడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది ఇజ్రాయెల్.

ఇరాన్.. గీత దాటిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. అమాయక ప్రజల ప్రాణాలతో అయతొల్లా ఖొమైనీ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+