Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై మిస్సైల్ దాడి!

మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు భయందోళనలను కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ(ద్రవీకృత సహజ వాయువు) ఉత్పత్తి కేంద్రమైన ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ లక్ష్యంగా ఇరాన్ బుధవారం అర్ధరాత్రి క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన 5 క్షిపణులలో నాలుగింటిని ఖతార్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగలిగినప్పటికీ.. ఓ క్షిపణి నేరుగా ప్లాంట్‌ను తాకడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 295 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ ప్రపంచ గ్యాస్ అవసరాలలో 20 శాతం తీరుస్తుంది. కాబట్టి ఈ దాడి అంతర్జాతీయ ఇంధన భద్రతపై కోలుకోలేని దెబ్బతీసింది.

ఖతార్ అల్టిమేటం
ఈ దాడిని ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది తమ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ.. ఇరాన్ మిలిటరీ అధికారులను 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ఆదేశించింది. ఈ పరిణామం దౌత్యపరంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్‌కు చెందిన 'సౌత్ పార్స్' గ్యాస్ క్షేత్రంపై చేసిన దాడికి ప్రతీకారంగానే.. ఇరాన్ మిత్రదేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలను లక్ష్యంగా చేసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Iran Missile Attack on Qatar Ras Laffan LNG Plant Global Energy Crisis and Oil Price Hike

గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం
దాడి జరిగిన గంటల వ్యవధిలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే రోజులో 8 శాతం పెరిగి బ్యారెల్‌కు 111.90 డాలర్లకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధిలో ఇప్పటికే ఉన్న అస్థిరతకు తోడు, తాజా దాడితో ఆసియా, యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోయే ముప్పు ఏర్పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

పొరుగు దేశాలపై దాడుల విస్తరణ
ఇరాన్ తన దాడులను కేవలం ఖతార్‌కే పరిమితం చేయకుండా పొరుగు దేశాలకు కూడా విస్తరించింది. అబుదాబిలోని హబ్ఘన్ గ్యాస్ ప్లాంట్ సమీపంలో క్షిపణి శకలాలు పడటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అదే విధంగా సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంత గ్యాస్ ప్లాంట్‌పై జరిగిన డ్రోన్ దాడిని అక్కడి సైన్యం అడ్డుకుంది. రియాద్ రిఫైనరీ సమీపంలో కూడా క్షిపణి శకలాలు పడటం గల్ఫ్ ప్రాంతం మొత్తంఒక అగ్నిగుండంగా మారిందనడానికి నిదర్శనం.

ప్రస్తుత పరిస్థితి ఇలా..
ప్రస్తుతానికి రాస్ లఫాన్‌లోని మంటలు అదుపులోకి వచ్చాయని, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఖతార్ ఎనర్జీ సంస్థ ప్రకటించినప్పటికీ.. ప్లాంట్ తిరిగి ఎప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. ప్లాంట్‌కు జరిగిన నష్టం అపారంగా ఉండటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. ప్రపంచ దేశాలు ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలు జరపాలని కోరుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+