ఇజ్రాయెల్ లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ను పేల్చేసిన ఇరాన్.. పలు కీలక భవనాలు ధ్వంసం
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య వారం రోజులుగా సాగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు దేశాలు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. దీంతో అటు ఇజ్రాయెల్.. ఇరాన్ లోని ప్రధాన కార్యాలయాలు, భవనాలు ధ్వంసం అవుతున్నాయి. ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, హైఫా, భీర్ షెవా లపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో భీర్ షెవాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ భవనం వద్ద క్షిపణి పడినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనలో టెక్ పార్క్ లోని బిల్డింగ్ స్వల్వంగా ధ్వంసం అయినట్లు సమాచారం.
జూన్ 13న ఇరాన్ పై బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసింది ఇజ్రాయెల్. అప్పటి నుంచి ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి బాంబులతో దాడులు చేసుకుంటూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలపై టెల్ అవీవ్, హైఫా, భీర్ షెవా లపై ఇరాన్ దాడులకు పాల్పడింది. భీర్ షెవా ప్రాంతం ఇజ్రాయెల్ లోని నెగేవా ఎడారిలో ఉంటుంది. అక్కడే ఇజ్రాయెల్ కు చెందిన నెవాటిమ్ ఎయిర్ బేస్ ఉంటుంది. భీర్ షెవాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయానికి సమీపంలో క్షిపణి పడి ఆ ప్రాంతం మొత్తం ధ్వంసం అయింది.

భీర్ షెవా ప్రాంతంలోని అనేక వీధులు అగ్నికీలల్లో చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఓవైపు జెనీవాలో ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు చర్చలు ప్రారంభమైనా మరోవైపు భీకర స్థాయిలో ఇజ్రాయెల్- ఇరాన్ దాడులు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇరాన్ పై క్షిపణులతో జరిపిన దాడుల్లో కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం ధ్వంసం అయింది. ఇరాన్ ఆయిల్ అండ్ సహజ వాయువు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సౌత్ పార్స్ ఫేజ్ లోని 14 ఆయిల్ రిఫైనరీలపై ఇజ్రాయెల్ డ్రోన్ లు విరుచుకుపడ్డాయి. దీంతో ఈ చమురు శుద్ధి కేంద్రాలన్నీ ధ్వంసం అయ్యాయి.












Click it and Unblock the Notifications