వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు భయంకరమైన వ్యాధి!: ఆ ఒప్పందంతో తూర్పు దేశాల్లో అరాచకమే!

ఒప్పందం మేరకు అమెరికా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకున్నాక.. వాటిని ఉగ్రవాదులకు అమ్మితే పరిస్థితేంటి? అని బహ్రమ్ ప్రశ్నించారు.

|
Google Oneindia TeluguNews

టెహ్రన్: అమెరికా-సౌదీ మధ్య జరిగిన ఆయుధ ఒప్పందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒప్పందం తూర్పు మధ్య దేశాల్లో ఉగ్రవాదులు మరింత బలపడేందుకు పరోక్షంగా ఉపకరిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి బహ్రమ్ క్వాసేమి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కాకుండా, ఆయుధాల వ్యాపారిగా వ్యవహరిస్తున్నారని బహ్రమ్ మండిపడ్డారు. ట్రంప్ కు ఇరానోఫోబియా అనే భయంకరమైన వ్యాధి పట్టుకుందని, అందువల్లే ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. గుర్రాన్ని చూసి వణికేవారు కొందరంటే.. నీటిని చూసి వణికిపోయేవారు కూడా కొందరుంటారని, అదే తరహాలో ఇరాన్ పేరు వింటేనే ట్రంప్ లో వణుకు మొదలవుతుందని, అందుకే ఆయన ఇరానోఫోబియాతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

Iran mocks Trump for milking Saudis

ఒప్పందం మేరకు అమెరికా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకున్నాక.. వాటిని ఉగ్రవాదులకు అమ్మితే పరిస్థితేంటి? అని బహ్రమ్ ప్రశ్నించారు. సౌదీ అలాంటి పని చేయగలదని ట్రంప్ హామి ఇవ్వగలరా? అంటూ నిలదీశారు. దుబాయ్ సైతం ఈ ఒప్పందాన్ని తప్పుపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే సిరియా, లెబనాన్, ఇరాక్, యెమెన్‌లలో తీవ్రవాదులు రెచ్చిపోతున్న తీరును ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి వారందరికీ అధునాతన ఆయుధాలు అందితే తూర్పు మధ్య దేశాల్లో పరిస్థితి మరింత అరాచకంగా తయారవుతుందని పేర్కొన్నారు.

English summary
Iran's foreign minister has accused President Donald Trump of using foreign policy as an excuse for selling billions of dollars' worth of weapons to Saudi Arabia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X