అమెరికా అంతం చూస్తాం: ఆప్త మిత్రుడి మృతదేహంపై ఇరాన్ సుప్రీమో ప్రమాణం

ఇరాన్: అమెరికా వైమానిక దాడుల్లో దుర్మరణం చెందిన ఇరాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖాసిం సులేమానీ మృతదేహంను చూసి ఇరాన్ సుప్రీమో అయతుల్లా అలీ ఖామేనీ భోరున విలపించారు. మృతి చెందిన ఖాసిం అయతుల్లాకు కుడి భుజంగా వ్యవహరించేవాడు. తన ఆప్త మిత్రుడిని అలా చూసి బాధను ఆపుకోలేకపోయిన అయతుల్లా గట్టిగా ఏడుస్తూ... అమెరికాను సర్వనాశనం చేస్తానంటూ ఖసిం మృతదేహంపై ప్రమాణం చేశారు. ఇప్పటికే ఖాసిం స్థానంలో కొత్తగా మరొక వ్యక్తిని ఆర్మీ చీఫ్‌గా నియమించడం జరిగింది. మరోవైపు ఇరాక్ గడ్డపై ఉన్న అమెరికా బలగాలను తరిమికొట్టాలని ఇరాక్ పార్లమెంటు తీర్మానించింది.

ఇక తాజాగా జరిగిన పరిణామాలతో ఇరాన్ తిరిగి ఒక అణుశక్తిగా మారే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఖాసింను అమెరికా బలగాలు హతమార్చడం, అమెరికా నాశనం చేస్తానని అధ్యక్షుడు అయతుల్లా ప్రమాణం చేయడం, ఇరాక్ అమెరికా బలగాలను తరిమికొట్టాలని పిలుపు నివ్వడంలాంటి మూడు పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అమెరికా వినాశనానికి ఇరాన్ తిరిగి ఆటం బాంబును తయారు చేసేందుకు ఊతమిచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే అదనుగా ఐసిసి కూడా ఇరాక్ భూభాగంపై అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అలజడులు, యుద్ధమేఘాలు కమ్ముకునే అవకాశాలున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

Iran President weeps after seeing his close friends dead body, vows to get rid of US

ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉండగా అగ్నికి ఆజ్యం పోస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా దళాలలను తరిమేందుకు ప్రయత్నిస్తే ఇరాక్‌ ఇంతకు ముందెన్నడూ చూడని ఆంక్షలు విధిస్తామని చెప్పారు. అంతేకాదు ఇరాక్‌ నుంచి కొన్ని బిలియన్ డాలర్లు నష్టపరిహారంగా వసూలు చేస్తామని బెదిరించారు ట్రంప్. ఇక ఖాసిం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వేలాదిగా ఇరానీలు తరలివచ్చారు. మిడిల్ ఈస్ట్‌లో మోహరించి ఉన్న అమెరికా బలగాలపై దాడి చేయాలని ఈ సందర్భంగా ఖాసిం కూతురు జైనబ్ పిలుపునిచ్చింది. అమెరికా సైనికులకు చెందిన కుటుంబాలు సైనికుల మృతదేహాల కోసం ఎదురు చూడాలని జైనబ్ వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+