ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్మోజ్ జల సంధి క్లోజ్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్.. భారత్ పై తీవ్ర ప్రభావం

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికా సైతం ఇరాన్ పై విరుచుకుపడుతోంది. ఇరాన్ మూడు ప్రధాన అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అదే గానీ జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇరాన్ తన బ్రహ్మాస్త్రం అయిన హార్మోజ్ జల సంధిని మూసేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ దేశాలపై భారీ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది.

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. మరోవైపు అమెరికా సైతం ఇరాన్ పై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేసేందుకు సిద్దం అవుతోంది. ఏ క్షణమైనా ఇరాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో హార్మోజ్ జల సంధిని మూసివేస్తాం అని ఇరాన్ ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా రోజూవారీ ముడి చమురు, గ్యాస్ అవసరాల్లో ప్రపంచ దేశాలకు 20శాతం.. భారత్ కు వచ్చే చమురు, గ్యాస్ లో 40 శాతం దీని ద్వారానే రవాణా అవుతోంది. ఇరాన్ తాజాగా తీసుకోబోతున్న నిర్ణయంతో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలపై అధిక ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Iran s Bold Move Hormuz Strait Truce Shuttered Shocking Global Markets

హార్మోజ్ జల సంధి ఎక్కడుంది..?

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ రవాణాలో హార్మోజ్ జల సంధి చాలా కీలకమైనది. ఈ జల సంధి ఇరాన్.. గల్ఫ్ దేశాల మధ్యలో ఉంటుంది. ఈ మార్గం గుండా రోజూ సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్, యూఏఈ, ఇరాన్ కు చెందిన చమురు ఓడలు ప్రయాణం సాగిస్తాయి. ఇది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. సముద్రంలోని ఒక్కో మార్గానికి మధ్య కేవలం 3 కిలోమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+