ఇరాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదు
టెహరాన్: ఇరాన్‌లోని కెర్నాన్ ప్రావిన్స్‌లో మంగళవారం భూకంపం సంభవించినట్లు ఆ దేశ అధికారిక టెలివిజన్ ఛానెల్ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు తెలిపింది.
ఇరాన్ రాజధాని టెహరాన్‌కు దక్షిణ దిశగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెజ్డాక్ పట్టణ సమీపంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంటోంది. నవంబర్‌లో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 600కు పైగా ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే.
ఇరాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2003లో వచ్చిన భూకంపాన్ని ఇరాన్ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. 6.6 తీవ్రత కలిగిన ఆ భూకంపం ధాటికి ఇరన్‌లోని చారిత్రక నగరం బామ్ నేలమట్టంకాగా 26 వేల మంది అశువులు బాశారు.












Click it and Unblock the Notifications