మొజ్తబా ఖమేనీ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ?

ఇరాన్ సుప్రీమ్ లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక నివేదికలు వెలువడుతున్నాయి. ఆయన కోమాలో ఉన్నారని, ఒక కాలును తొలగించినట్లు రిపోర్టులు అందుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బ్రిటిష్ మీడియా హౌస్ 'ది సన్' గతంలో తెలిపింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అత్యంత విశ్వసనీయ వర్గాలను తన కథనంలో ఉటంకించింది.

ఇప్పుడు తాజాగా ఆయన ఆరోగ్యంపై మరో కథనం వెలువడింది. ది న్యూయార్క్ టైమ్స్ దీన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం మొజ్తబా ఖమేనీ జీవించి ఉన్నారు. ప్రస్తుతం యుద్ధానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. ఫిబ్రవరి 28 నాటి దాడుల సమయంలో ఆయనకు గాయాలు కావడం వల్ల ఓ రహస్య ప్రదేశంలో చికిత్స తీసుకుంటోన్నారు.

Iran Supreme Leader Mojtaba Khamenei Wounded Operating in Shadow as Reportedly Plastic Surgery

అతి కొద్దిమంది సన్నిహితులు, ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కు చెందిన అత్యున్నత అధికారులతో మాత్రమే కలుస్తున్నారు. ఇప్పటి వరకు ఒక కాలికి మూడుసార్లు శస్త్రచికిత్స చేశారు. ఓ కృత్రిమ అవయవాన్ని ఇంకా అమర్చాల్సి ఉంది. దీనికోసం ఎదురు చూస్తున్నారు. మరో చేతికి కూడా సర్జరీ నిర్వహించారని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. పేర్లు చెప్పడానికి నిరాకరించిన ముగ్గురు అత్యున్నత స్థాయి అధికారులను తన కథనంలో ఉటంకించింది.

దాడి సమయంలో ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోయాయి. ఫలితంగా ఇప్పటికీ మొజ్తబా ఖమేనీ సజావుగా మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడటం కష్టంగా మారింది. చికిత్స తర్వాత కూడా ముఖం, పెదవులు సాధారణ స్థితికి రావట్లేదు. దీంతో ఆయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సుప్రీమ్ లీడర్ గా ఎన్నికయ్యాక కూడా మొజ్తబా ఖమేనీ ఎక్కడే గానీ బహిరంగంగా కనిపించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని అంచనా వేసింది. టీవీ, మీడియాలో కూడా కనిపించలేదాయన.

యుద్ధ సమయంలో తాను బలహీనంగా కనిపించకూడదనేది మొజ్తబా తుది నిర్ణయమని, అందుకే ఓ రహస్య ప్రదేశంలో ఉంటూ పాలన సాగిస్తోన్నారని పేర్కొంది. ఆయనకు పంపే సందేశాలన్నీ కూడా చేత్తో రాసినవి కావడం, వాటిపై కవర్లపై అత్యున్నత స్థాయిని సూచించే సీల్ వేసి ఉండటం, నేరుగా కాకుండా హ్యూమన్ చైన్ సిస్టమ్ ద్వారా అంటే ఒకరి తర్వాత ఒకరుగా ఆ కవర్లు ఖమేనీ చేతికి అందుతున్నాయని, ఆయన ఇచ్చే సమాధానాలు కూడా అదే స్థాయిలో ఉంటోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+