ఇరాన్ వద్ద తరగని గని- కొత్తగా 7.5 ట్రిలియన్ల క్యూబిక్ అడుగుల నేచురల్ గ్యాస్ గుర్తింపు

భూగర్భ ఇంధన వనరుల్లో సుసంపన్న దేశం.. ఇరాన్. ఇక్కడ మరోసారి భారీ సహజ వాయు నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయి. దీని పరిమాణం.. 7.5 ట్రిలియన్ క్యూబిక్ అడుగులు. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని ఫార్స్ ప్రావిన్స్‌లో వీటిని గుర్తించినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఇక్కడ విస్తారమైన సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు మంత్రి మొహసిన్ పాక్‌నెజాద్ వెల్లడించారు. అమెరికాతో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇవి వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ నేచురల్ గ్యాస్ రికవరీ రేటు దాదాపు 5.7 ట్రిలియన్ క్యూబిక్ అడుగులు. అంతే.. ఇంత పరిమాణంలో సహజ వాయువును వెలికితీయవచ్చు. ఇది అత్యంత నాణ్యమైన స్వీట్ గ్యాస్ రకానికి చెందినది కావడం విశేషం. రసాయన పరంగా ఇందులో సల్ఫర్ పరిమాణం చాలా తక్కువగా ఉండటం వల్ల శుద్ధి ప్రక్రియ అత్యంత సులభంగా మారుతుందని, దీనికి ఉన్న సహజ స్వభావం వల్ల రోజువారీ నిర్వహణ ఖర్చులు సైతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేసింది.

Iran Uncovers 7 5 Trillion Cubic Feet of Sweet Natural Gas in Fars province 5 7 Trillion Recoverable to use

ఈ ఎనర్జీ ఫీల్డ్‌లో సహజ వాయువుతో పాటు విలువైన గ్యాస్ కండెన్సేట్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ఇరాన్ మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు గానీ, ఇతరత్రా వివరాలను గానీ అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇజ్రాయెల్, అమెరికాతో నెలకొన్న తీవ్ర భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ ఎనర్జీ వనరుల వ్యవస్థ ప్రస్తుతం విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కీలకమైన పవర్ గ్రిడ్స్, క్రూడాయిల్, నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను పునరుద్ధరించుకోవడానికి శ్రమిస్తోంది. ఇలాంటి సంక్షోభ సమయంలో నూతన నిక్షేపాలు లభించడం ఆ దేశానికి ఊరట లభించినట్టయింది.

ఈ సైనిక దాడుల వల్ల ఇరాన్ ఇంధన ఉత్పత్తి సామర్థ్యం రోజుకు సుమారు 230 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు తగ్గిపోయిందని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఇదివరకే వెల్లడించింది. ఇది.. దేశీయ విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. పవర్ గ్రిడ్లపై లోడ్ పెరిగి అనేక ప్రాంతాల్లో గంటల కొద్దీ కోతలు విధించాల్సి వస్తోందక్కడ. ఇరాన్ తన మొత్తం విద్యుత్‌లో 85 శాతం గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచే పొందుతుండటం గమనార్హం.

సహజ వాయువు నిల్వల పరంగా రష్యా తర్వాత ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. ఇరాన్. ప్రస్తుతం అక్కడ దాదాపు 34 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ లో కూడా దక్షిణ ఇరాన్‌లోని పజాన్ ఫీల్డ్ లో 10 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్, 200 మిలియన్ బారెళ్ల ముడి చమురు నిల్వలను కనుగొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+