Iran vs Israel: ఇజ్రాయిల్‌కు ఇరాన్ వార్నింగ్..మరో యుద్ధం తప్పదా..?
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరో ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. "దాడి జరిగిన తర్వాత స్పందించడం కాదు.. దాడి జరుగుతుందని తెలిస్తే ముందే దెబ్బకొడతాం" అంటూ ఇరాన్ చేసిన హెచ్చరికలు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలను మరింత సాంద్రతరం చేశాయి.
పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ భేరి మోగే సూచనలు కనిపిస్తున్నాయి. తమ భూభాగంపై దాడి జరిగే వరకు వేచి చూడబోమని, ముప్పు పొంచి ఉందని భావిస్తే శత్రువుపై ముందస్తు దాడి చేసేందుకు కూడా వెనుకాడబోమని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. రెండ్రోజుల క్రితం కొత్తగా ఏర్పాటైన 'ఇరానియన్ డిఫెన్స్ కౌన్సిల్' విడుదల చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
హెచ్చరిక వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నా లేదా దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించినా కఠినమైన ప్రతిఘటన తప్పదని డిఫెన్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. "మా భద్రతా లెక్కల ప్రకారం ముప్పు పొంచి ఉందని స్పష్టమైన ఆధారాలు ఉంటే, మేము కేవలం రక్షణాత్మక ధోరణిలోనే ఉండము.. శత్రువుపై ముందస్తుగా విరుచుకుపడతాము" అని ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి.ఈ హెచ్చరిక కేవలం మాటలకే పరిమితం కాలేదు. దీని వెనుక బలమైన కారణాలు సన్నాహాలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రకటనకు రెండు రోజుల ముందే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు మిస్సైల్ యూనిట్లతో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది.ఇరాన్ స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రత తమకు 'రెడ్ లైన్' అని, దాన్ని ఎవరు దాటినా సహించబోమని కౌన్సిల్ హెచ్చరించింది.ఇరాన్ లోపల ప్రస్తుతం ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం కారణంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల దృష్టిని మళ్లించేందుకు లేదా అంతర్గత భద్రతను కాపాడుకునేందుకు ఇరాన్ ఈ దూకుడు ప్రదర్శిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్ మరియు అమెరికాను మరింత అప్రమత్తం చేశాయి. ఒకవేళ ఇరాన్ నిజంగానే ముందస్తు దాడికి దిగితే, అది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగా మిగిలిపోదు.ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం చూపే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రపంచ దేశాల కళ్లన్నీ టెహ్రాన్ మరియు టెల్ అవీవ్ వైపే ఉన్నాయి.












Click it and Unblock the Notifications