పాకిస్థాన్‌ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. యెమెన్ విషయంలో తలదూర్చితే..

సౌదీ అరేబియా- పాకిస్థాన్- టర్కీ మధ్య కుదిరిన డిఫెన్స్ ఒప్పందంపై ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మూడు దేశాల మధ్య జరిగిన ఈ రక్షణ ఒప్పందం అక్టోబర్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే యెమెన్ విషయంలో పాకిస్థాన్ ఏదైనా జోక్యం చేసుకుంటే ప్రాంతంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య సంధి కుదుర్చేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ఈ కూటమిలో చేరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం.. ఇటీవల సౌదీ అరేబియాపై హౌతీల దాడులు అధికం అయిన నేపథ్యంలో సౌదీ అరేబియా- పాకిస్థాన్- టర్కీ మధ్య ఈ డిఫెన్స్ ఒప్పందం అక్టోబర్ 5 న కార్యరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందంలో భాగంగా సౌదీకి పాకిస్థాన్, టర్కీలు సైన్యాన్ని పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక వేల సంఖ్యలో పాకిస్థానీ దళాలు సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భగేయ్ స్పందించారు. తాను కూడా ఈ వార్త గురించి విన్నానని.. ఇది అబద్ధం అయితే బాగుండునని స్పష్టం చేశారు. "యెమెన్ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా అది ఆ సంబంధిత దేశానికి తీవ్ర పరిణామాలుంటాయని తెలుసు. అలాగే మక్కా ఒప్పందాన్ని ముస్లిం సమాజ ప్రయోజనాలకు ఉపయోగించరు అని ఆశిస్తున్నా" అని ఇస్మాయిల్ భగేయ్ స్పష్టం చేశారు.

అలాగే సౌదీ అరేబియా- పాకిస్థాన్- టర్కీ డిఫెన్స్ ఒప్పందంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పరోక్షంగా స్పందించారు. పొరుగు దేశాలు స్వయం సమృద్ధిని అలాగే నిజమైన సోదరభావాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. అలాగే ఇలాంటి ఒప్పందాలు ఇరాన్ ను ఏమాత్రం కట్టడి చేయవని స్పష్టం చేశారు. ఇక ఇరాన్ కు చెందిన చాలా మంది లా మేకర్స్ ఈ ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది ఓ పేపర్ అండ్ పొలిటికల్ పాక్ట్ అని వర్ణిస్తున్నారు. అటు ఇరాన్ ప్రభుత్వ మీడియా కూ ఈ మూడు దేశాల ఒప్పందాన్ని తప్పుబడుతున్నాయి.

Iran warns Pakistan of severe consequences if it intervenes in the Yemen issue iran warning to pak

యెమెన్ ప్రజలకు వ్యతిరేకంగా సౌదీ చేపట్టిన యుద్ధంలో టర్కీ, పాకిస్థాన్ చేరాయని తస్నిమ్ న్యూస్ వెల్లడించింది. అలాగే ఇది మక్కా కూటమా లేక యెమెన్‌ లోని అణగారిన ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమా..? అని నూర్ న్యూస్ పలు ప్రశ్నల్ని లేవనెత్తింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+