పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట 2.0.. పోలవరం గిరిజన ప్రాంతాల ప్రగతి బాట!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మారుమూల గిరిజన గ్రామాలపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఏపీలో మారుమూల ట్రైబల్ ఏరియాలలో కూడా అభివృద్ధికి నడుం బిగించారు. ఈ క్రమంలో పోలవరం జిల్లాలో అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పోలవరం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఉప ముఖ్యమంత్రికి గిరిజనులు ఘన స్వాగతం పలికారు.

రాకోట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గిరిజనులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన అటవీ ఉత్పత్తులు, వాటి మార్కెటింగ్ సదుపాయాల గురించి ఉప ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనగ్రామాల్లో అమలవుతున్న పలు అభివృద్ధి పథకాల ప్రగతిని అధికారులు ఆయనకు వివరించారు. రాకోటను రెవెన్యూ గ్రామంగా మార్చాలని గ్రామస్తులు కోరగా, గిరిజనులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Deputy CM Pawan Kalyan Launches Adavi Thalli Bata 2 0 for Tribal Development in Polavaram

ఈ సందర్భంగా ఓ గిరిజన మహిళ ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి "మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి" అని సూచించింది. ఆమె మాటలు సమావేశంలోని వారిని కదిలించాయి. అడవి తల్లి బాట కార్యక్రమం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, ప్రాథమిక సదుపాయాలు కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభమైంది.

ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో ఈ పథకం కింద పలు రోడ్లు మంజూరు చేశారు. పోలవరం జిల్లాలోనూ గిరిజన ఆవాసాలను ప్రధాన రహదారులతో అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. గిరిజనులు తయారు చేసే అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పించి, వారి ఆదాయం పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మెట్రోస్టేషన్ల నుండి నేరుగా మీ గమ్యస్థానాలకు..డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు!
మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మెట్రోస్టేషన్ల నుండి నేరుగా మీ గమ్యస్థానాలకు..డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు!

పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా గిరిజనులు తమ సాంప్రదాయ కళా ప్రదర్శనలు ప్రదర్శించారు. అటవీ ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చెదరకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గిరిజనుల సమస్యలను నేరుగా విని పరిష్కారం చూపించే విధంగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్న శ్రద్ధ గిరిజన ప్రాంతాల ప్రజల జీవితాలలో ఆశలు చిగురించేలా చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+