ఇరాన్‌లో మరో విమాన ప్రమాదం: 135 మంది ప్రయాణికులతో వెళ్తూ..జారిపోయి: నడిరోడ్డ మీద

Recommended Video

    ఇరాన్‌లో మరో విమాన ప్రమాదం: 135 మంది ప్రయాణికులతో వెళ్తూ..!!

    టెహ్రాన్: ఇరాన్‌లో మరో విమాన ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గురైన సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన నుంచి వారంతా ప్రాణాలతో బయట పడగలిగారు. విమానం పట్టుతప్పి రన్‌వేను దాటుకుని.. జారుకుంటూ నడి రోడ్డు మీదికి వెళ్లింది. ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుంచి కిందికి దిగారు. ఈ సమయంలో విమానం పెద్ద ఎత్తున కుదుపులకు గురి కావడంతో కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

    ఇరాన్‌కు చెందిన క్యాస్పియన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానం అది. సోమవారం తెల్లవారు జామున టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 135 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరింది. 6:45 నిమిషాలకు ఖుజెకిస్తాన్ ప్రావిన్స్‌లోని మహషహర్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. మహషహర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ల్యాండ్ అయిన వెంటనే చక్రాలు స్తంభించిపోయాయి.

    Iranian flight exited runway when landing in the airport of Mahshahr Port city,

    ఫలితంగా- విమానం అదుపు తప్పింది. శరవేగంతో విమానాశ్రయం ప్రహరీ గోడను ఢీ కొట్టింది. అదే వేగంతో మహషహర్ రోడ్ల మీదికి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కుదుపుల వల్ల కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో విమానంలో మంటలు చెలరేగి ఉంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేదనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

    ఖుజెస్తాన్ ప్రావిన్స్ ఎయిర్‌పోర్టుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మొహ్మద్ రెజా ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. రన్‌వే మీది నుంచి విమానం పట్టుతప్పిందని, ఆ సమయంలో విమానం అతివేగంతో ప్రయాణించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. నడిరోడ్డు మీద ఆగపోయిన విమానాన్ని తరలించడానికి ఏర్పాట్లు ఆరంభించినట్లు చెప్పారు. గాలిలో ఉన్న సమయంలో ప్రమాదం సంభవించి ఉంటే జరిగే ప్రాణనష్టాన్ని అంచనా వేయలేమని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+