మిస్సైల్ మీద పడితే ఎట్టా ఉంటాదో తెలుసా- సీసీటీవీలో రికార్డ్
Iran Israel War: లెబనాన్‌లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా దారుణ హత్యకు ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఇజ్రాయెల్‌పై దండెత్తింది. రెండు గంటల వ్యవధిలో 181 శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది. రాజధాని టెల్ అవివ్ సహా అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఇరాన్ టార్గెట్‌లోకి వచ్చాయి.
హెజ్బొల్లాను దాదాపుగా నామరూపాల్లేకుండా చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించిందే అయినప్పటికీ- గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.

హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా మొన్నటికి మొన్న ఇజ్రాయెల్‌పై లెబనాన్ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. జెరూసలెం సహా తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరెన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ సైతం యుద్ధానికి దిగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఇరాన్ చేసిన మిస్సైళ్ల దాడిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది ఇజ్రాయెల్. లక్ష్యాన్ని తాకకుండా గగనతలంలోనే వాటిని పేల్చివేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఫలితంగా ఇరాన్ అంచనా వేసిన విధంగా తమ దేశంలో భారీగా ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మరణించినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఐడీఎఫ్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వింగ్ విడుదల చేసింది. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ పరిధిలోకి వచ్చే జెరికో సిటీలో రోడ్డుపై నడిచుకుంటూ వెళ్తోన్న ఓ వ్యక్తిపై మిస్సైల్ పడటం ఇందులో కనిపించింది. రోడ్డంతా ఖాళీగానే ఉన్నప్పటికీ- సరిగ్గా మిస్సైల్ ఆ వ్యక్తి మీదే పడటం రికార్డయింది.
కొన్ని మీటర్ల ఎత్తులో నుంచి అత్యంత బరువైన క్షిపణి ఆ వ్యక్తిపై పడటం వల్ల అతని శరీరం ఛిద్రం కావడాన్ని చూడొచ్చు. ఇదొక్కటి మినహా తమ దేశంలో ఇరాన్ దాడుల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications