బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్, 64 మంది మృతి : ఐఎస్ఐఎస్ పనే
ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ భారీ పేలుడు ధాటికి బాగ్దాద్ లో పెను విధ్వంసం సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ లో పేలుళ్లు సంభవించడంతో.. ప్రాణ నష్టం భారీగా జరిగింది. మొత్తం 64 మంది ఈ బాంబు పేలుళ్లకు తునా తనకలైపోయారు.

మార్కెట్ పరిధిలోని ఓ బ్యూటీ సెలూన్ వద్ద నిలిపి ఉంచిన కారు అకస్మాత్తుగా పేలింది. పేలుళ్ల ప్రమాదంతో 64 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరో 87 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయినవారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. అయితే ఈ దారుణానికి ఒడిగట్టింది తామేనని ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్). కాగా.. గాయపడ్డవారితో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications