ఐఎస్ఐఎస్‌పై భీకర పోరు: ఇరాక్ సేనల వశమైన తిక్రిత్(పిక్చర్స్)
బాగ్దాద్: ఉగ్రవాదులపై భీకర పోరాటం చేసిన ఇరాక్ సేనలు ఎట్టకేలకు తిక్రిత్ నగరాన్ని తమ వశం చేసుకున్నాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ప్రధాన స్థావరాలను సైన్యం స్వాధీనం చేసుకుంటోంది. అక్కడ భారీ సంఖ్యలో మారణాయుధాలు బయటపడుతున్నాయి. నెల రోజుల భీకర పోరు తర్వాత ఇరాకీ సేనలు పైచేయి సాధించాయి.
ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ప్రాంతం అయిన తిక్రిత్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. దీంతో తిక్రిత్ ఆస్పత్రితోపాటు అనేక ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఇరాకీ సేనల ఆధీనంలోకి వచ్చేశాయి. ఇరాక్ జాతీయ పతకాన్ని చేతపట్టుకుని సైనికులు విజయోత్సాహంతో పరుగులు తీస్తున్నారు.
ఐఎస్ఐఎస్ రహస్య స్థావరాల్లోకి ప్రవేశించి అక్కడున్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మరికొన్ని బాంబులను నిర్విర్యం చేస్తున్నారు. నిరుడు జూన్‌లో తిక్రిత్ నగరం ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆక్రమించుకుంది.
కాగా, తిక్రిత్‌పై పట్టు సాధించేందుకు చాలా శ్రమపడాల్సి వచ్చిందని ఇరాక్ సైనికులు చెబుతున్నారు. తిక్రిత్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నారని, వారి ఏరివేత పనులు కొనసాగుతున్నాయని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది.

భీకర పోరు
ఉగ్రవాదులపై భీకర పోరాటం చేసిన ఇరాక్ సేనలు ఎట్టకేలకు తిక్రిత్ నగరాన్ని తమ వశం చేసుకున్నాయి.

భీకర పోరు
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ప్రధాన స్థావరాలను సైన్యం స్వాధీనం చేసుకుంటోంది.

భీకర పోరు
అక్కడ భారీ సంఖ్యలో మారణాయుధాలు బయటపడుతున్నాయి. నెల రోజుల భీకర పోరు తర్వాత ఇరాకీ సేనలు పైచేయి సాధించాయి.

భీకర పోరు
ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ప్రాంతం అయిన తిక్రిత్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

జాతీయ పతాకంతో ఇరాకీ సైన్యం
దీంతో తిక్రిత్ ఆస్పత్రితోపాటు అనేక ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఇరాకీ సేనల ఆధీనంలోకి వచ్చేశాయి. ఇరాక్ జాతీయ పతకాన్ని చేతపట్టుకుని సైనికులు విజయోత్సాహంతో పరుగులు తీస్తున్నారు.












Click it and Unblock the Notifications