వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ బానిసగా ఎంతోమందితో: ఐసిస్ కమాండర్‌ని చంపి, మహిళ ప్రతీకారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇరాక్: తనను సెక్స్ బానిసగా మార్చాడనే కోపంతో ఇరాక్ దేశానికి చెందిన ఓ మహిళ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ కమాండర్‌ను మట్టుబెట్టింది. ఈ సంఘటన ఇరాక్‌లోని మోసుల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు అనాస్ అనే వ్యక్తి కుర్దిష్ మైనార్టీ వర్గానికి చెందిన మహిళను సెక్స్ బానిసగా మార్చాడు. ఆమెను పలువురికి విక్రయించాడు. దీంతో, అతని పైన ఆమె పగ పెంచుకుంది. అతనిని చంపాలని నిర్ణయించుకొని, అతనిని కాల్చి చంపేసింది.

Iraqi woman kills ISIS commander who forced her into sex slavery

అబూ అనాస్ ఆమెను మూడు నెలల క్రితం సెక్స్ బానిసగా మార్చాడు. అతను కమాండర్ కావడంతో పలువురితో బలవంతంగా ఆమెకు పెళ్లి చేశాడు. అమ్మేశాడు. వారు ఆమె పైన అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో ఆమె ప్రతీకారం పెంచుకుంది.

ఆ కమాండర్‌ను సదరు మహిళ శనివారం నాడు కాల్చి చంపింది. ఐసిస్ ఉగ్రవాదుల దారుణాలు చెప్పలేకుండా ఉన్న విషయం తెలిసిందే. మహిళలను వారు సెక్స్ బానిసలుగా చేసుకుంటున్నారు. పలువురిని దారుణంగా చంపేస్తున్నారు.

English summary
The woman, believed to be be a member of the Yazidi Kurdish minority, shot dead senior Islamic State commander Abu Anas, according to TV News.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X