హోటల్‌కు వచ్చిన ప్రధానిని 20 ని.లు వెయిట్ చేయించిన యువతి

డిన్నర్ కోసం వచ్చిన దేశ ప్రధానిని ఇరవై నిమిషాల పాటు నిరీక్షించేలా చేసింది ఓ హోటల్ వెయిట్రెస్. అతనిని తమ దేశ ప్రధానిగా ఆమె గుర్తించక పోవడమే ఇందుకు కారణం.

చికాగో: డిన్నర్ కోసం వచ్చిన దేశ ప్రధానిని ఇరవై నిమిషాల పాటు నిరీక్షించేలా చేసింది ఓ హోటల్ వెయిట్రెస్. అతనిని తమ దేశ ప్రధానిగా ఆమె గుర్తించక పోవడమే ఇందుకు కారణం.

అతను ప్రధాని అని తెలిశాక క్షమాపణలు కోరింది. డబ్లిన్‌ నగరానికి చెందిన ఇరవై ఏళ్ల ఎమ్మా కెల్లీ చికాగోలోని ఓ హోటల్లో వెయిట్రెస్‌గా పని చేస్తోంది. ఐర్లాండు ప్రధాని లియో వరాద్కర్‌ తన మిత్రుడితో కలిసి అక్కడికి వచ్చారు.

Irish Hostess in Chicago Exiles Her Country's PM to Tiny Table

మొదట ఆమె మీరు ఐర్లాండుకు చెందిన వారా అని అడిగి వారిని కాసేపు ఎదురు చూడమని చెప్పారు. చివరకు ఓ చిన్న బల్లను కేటాయించారు.

ఇంతలో ఆమె మిత్రుడొకరు అతనిని గుర్తు పట్టారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తర్వాత తాను చేసిన తప్పుకు పశ్చాతాపపడుతూ వరాద్కర్‌ను క్షమాపణలు కోరారు.

అనంతరం ఆర్టీఈ రేడీయోలో మాట్లాడారు. తమ హోటల్‌కు ప్రధాని వస్తారని అసలు ఊహించలేదని చెప్పారు. వెంటనే వారిని వేరే బల్లకు మార్చామనిస ఈ క్రమంలో ఆయనకు క్షమాపణలు చెప్పానన్నారు.

ఏం కాదని, తనను సాధారణ పౌరుడిలా భావించడం బాగుందని అతను తనతో చెప్పారని ఎమ్మా అన్నారు. జరిగిందంతా ట్విటర్‌లో ఆమె పేర్కొన్నారు. దీనిపై ఆయన.. ధన్యవాదాలు ఎమ్మా మీ ఆహారం, సేవలు చాలా బాగున్నాయని పేర్కొన్నారు.

భారతీయ మూలాలున్న వరాద్కర్‌ ఐర్లాండ్‌ మొదటి స్వలింగ సంపర్క ప్రధాని. ఆయన తండ్రి ఆశోక్‌ వరాద్కర్‌ ముంబైలో పుట్టారు. ఐర్లాండుకు వలస వెళ్లి అక్కడే డాక్టర్‌గా స్థిరపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+