వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి చేసుకోవాలని ఇమ్రాన్‌‌ఖాన్‌పై సిస్టర్స్ ఒత్తిడి, త్వరలో

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే ఆయన పైన సోదరీమణులు అందుకోసం ఒత్తిడి తెస్తున్నారట. పీటీఐ పార్టీని స్థాపించిన ఆయన అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టాలనుకుంటారు. అయితే, ఆయనను మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబంలోనే ముప్పు తిప్పలు పెడుతున్నారట.

చుట్టాలలోనే ఒక అమ్మాయిని చూసిన ఇమ్రాన్ సోదరీమణులు, ఆమెను పెళ్లి చేసుకొని మళ్లీ కొత్త జీవితం ప్రారంభించమని ఒత్తిడి తెస్తున్నారట.

Is Imran Khan getting married soon

ఇమ్రాన్ ఖాన్ 2004లో జెమీమా ఖాన్‌కు విడాకులు ఇచ్చాడు. జెమీమా ఖాన్ బ్రిటిష్ బిలియనీర్ సర్ జేమ్స్ గోల్డ్‌స్మిత్ కూతురు. ఆమెను 1995లో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ తొమ్మిదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. వీరిద్దరు కూడా ఎక్కువగా తల్లితోనే ఉంటారు.

ఈ నేపథ్యంలో.. ఇమ్రాన్‌ను మళ్లీ పెళ్లి చేసుకోమని ఆయన అక్కాచెల్లెల్లు ఒత్తిడి తెస్తున్నారట. ఇమ్రాన్ సోదరిమణులు చుట్టాల్లోనే ఓ అమ్మాయిని చూశారట. ఆమెను త్వరలో పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారట. అయితే, దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఇంకా స్పందించలేదు.

English summary
Imran Khan may not be single for very long as his family members have been pressuring him to get married in the near future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X