అత్యాచారం, లైంగిక వేధింపు, హింస: యువతులపై ఐసిస్ దారుణాలు
సిరియా: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు యాజిది మహిళల పైన ఘోరమైన దారుణాలకు పాల్పడుతున్నారు. వారిని అత్యాచారం, లైంగిక వేధింపులు, హింసించడం వంటివి చేస్తున్నారు. ఈ విషయాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది.
హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఐసీస్ ఘాతుకాలపై స్పందిస్తూ.. ఇవి చేస్తున్న ఘాతుకాలు మానవత్వానికి పూర్తి వ్యతిరేకమన్నారు. వారు స్పందించినట్లుగా న్యూయార్క్ పోస్ట్‌లో వచ్చింది.

హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఈ ఏడాది ఆరంభంలో దోహుక్ పట్టణానికి వెళ్లింది. అక్కడ దాదాపు ఇరవై మంది మహిళలను ఇంటర్వ్యూ చేసింది. అందులో బాలికలు కూడా ఉన్నారు. వారు ఐసిస్ ఉగ్రవాదుల బారి నుండి బయటపడిన వారని చెప్పారు.
ఉత్తర ఇరాక్ ప్రాంతంలో వేలాది మంది యాజిది మహిళలను ఐసిస్ ఉగ్రవాదులు బలవంతంగా తీసుకు వచ్చారు. బంధీల నుండి మహిళలను, యువతులను వేరు చేశారు. అక్కడి నుండి వారిని తీసుకు వెళ్లారని సమాచారం. ఇలా తీసుకు వెళ్లిన మహిళలు, యువతుల పైన దారుణానికి పాల్పడుతున్నారు.












Click it and Unblock the Notifications