అమెరికన్ యువతిపై పలుమార్లు ఐసిస్ నేత రేప్
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ యువతిని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు పలుమార్లు అత్యాచారం చేసి చంపేశారు. ఐసిస్‌కు చెందిన ఓ నాయకుడు ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడు. ఐసిస్ ఉగ్రవాదులు బందీల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త కేలా మ్యుల్లర్ (27) ఏళ్ల యువతిపై ఐఎస్ నేత అబూబాకర్ అల్ బాగ్దాదీ ఏకంగా పెళ్లి పేరిట పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండేళ్ల క్రితం సిరియాలోని ఓ ఆసుపత్రి నుంచి మ్యుల్లర్‌నూ, ఆమె స్నేహితుడిని ఐసిస్ ఉగ్రవాదులు అపహరించారు. రెండు నెలల అనంతరం మ్యుల్లర్ స్నేహితుడిని విడిచిపెట్టిన ఉగ్రవాదులు ఆమెను తమకు నిధులు సమకూర్చే అబూ సయ్యఫ్ ఇంట్లో కొంతకాలం బందీగా ఉంచారు.

అక్కడికి తరచుగా వచ్చే బాగ్దాదీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడని, మ్యుల్లర్‌తో పాటు బందీగా ఉన్న మరో ఇద్దరు యాజ్దీ తెగ టీనేజ్ బాలికలు తెలిపారు. అమెరికా డెల్టా ఫోర్స్ దళం దాడిలో అబూ సయ్యఫ్ మరణించగా అతని భార్య ఉమ్ సయ్యఫ్ బందీగా చిక్కింది.
ఆమెను విచారణ జరిపినప్పుడు కూడా మ్యుల్లర్‌పై లైంగిక దాడి జరిగినట్టు తెలిపిందని అమెరికా సైనికాధికారులు చెప్పారు. జోర్డాన్ దళాల వైమానిక దాడిలో మ్యుల్లర్ మరణించిందని ఐఎస్ ప్రకటించింది.
'అమెరికా, మిత్రపక్షాలపై దాడి చేయండి'
అమెరికా, దాని మిత్ర పక్షాల పైన ఆత్మాహుతి దాడులు చేయాలని అల్ ఖైదా మద్దతుదారులకు ఒసామా బిన్ లాడెన్ తనయుడు హమ్జా పిలుపునిచ్చాడు. జీహాదీల యుద్ధాన్ని మధ్యప్రాచ్యం నుంచి అమెరికా, యూదు అమెరికన్ల వైపునకు తిప్పవలసిన సమయం వచ్చిందన్నాడు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications