రష్యా ప్లేన్: మేమే కూల్చామని ఐసిస్ వీడియో రిలీజ్

కైరో: రష్యాకు చెందిన విమానం ఈజిప్ట్ సినాయ్‌ ద్వీపకల్పంలో శనివారం కూలిపోయిన విషయం తెలిసిందే. అందులోని 224 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విమానాన్ని తామే కూల్చివేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

ఐసిస్ ప్రకటనను ఈజిప్టు, రష్యాలు ఖండించాయి. ఐసిస్ తీవ్ర వాదుల వద్ద 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమనాన్ని కూల్చివేసే ఆయుధాలు లేవని వారు చెప్పారు.

అయితే, ఆదివారం నాడు ఐసిస్ ఉగ్రవాదులు విమానం కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఐసిస్ తీవ్రవాదులు విడుదల చేసిన వీడియో దశ్యాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Is this proof ISIS shot down Russian plane killing all 224 on board?

మరోవైపు విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్‌ను దర్యాఫ్తు అధికారులు నిపుణులకు పంపించారు. కాగా, ఈజిప్టులో కూలిన విమాన ప్రయాణీకులకు సంబంధించిన ఫోటోలు హృతయాలను కలచివేస్తున్నాయి. ఈ విమానంలో ప్రయాణించిన పదినెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదంలో అలెక్సీ గ్రోవోవ్, తాతియానా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తాతియానా ఫోటోలను బట్టి ఆమె గర్భవతిగా భావిస్తున్నారు. ఈ విమానంలో ప్రయాణించిన వారిలో అత్యధికులు రష్యావారు. చనిపోయిన 217 మందిలో 17 మంది బాలలు, 138 మంది మహిలలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+