అల్టిమేట్: స్టన్నింగ్ సెల్ఫీ తీస్కున్నాడు, కానీ కొత్తకాదు
ఓహియో: ఓ వ్యక్తి అల్టిమేట్ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీ అందర్నీ అద్భుతానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు చాలామంది వివిధ రకాలుగా సెల్ఫీలు తీసుకోవడం చూశాం. సాధారణంగా మనకు సాధ్యం కాని సెల్ఫీని అతను తీసుకున్నాడు.
అమెరికా ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ షేన్ బ్లాక్ ఈ అద్భుతమైన, స్టన్నింగ్ సెల్ఫీ తీసుకున్నాడు. హవాయిలోని 13,500 కంటే ఎక్కువ ఎత్తు ఉండే మౌనా కియా శిఖరం అంచున నిలబడి అతను ఈ సెల్ఫీని తీసుకున్నాడు.

మొత్తం 23 ఫ్రేములతో షేన్ బ్లాక్ చిత్రాన్ని సృష్టించాడు. ఓ వైపు చంద్రుడు, మరోవైపు అగ్ని పర్వతం, ఇంకోవైపు పాలపుంత.. వీటన్నింటి ముందూ నిల్చుని అతడు ఈ సెల్ఫీ దిగాడు. ఇతడికి మాత్రం ఇలాంటి సెల్ఫీలు కొత్త కాదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications