భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి
న్యూఢిల్లీ: 2014 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ ముగ్గిరిని వరించింది. జపాన్‌కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, షుజి నకమురాలు ఈ ఏడాది నోబెల్ విజేతలుగా ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
తక్కువ శక్తితో ఎక్కువ కాంతినిచ్చే ఎల్‌ఈడీ లైట్‌ని కనిపెట్టినందుకు వీరికి బహుమతి లభించింది. రసాయన శాస్త్ర విభాగానికి సంబంధించిన నోబెల్ ప్రైజ్ వివరాలను బుధవారం ప్రకటించనున్నారు.
గురవారం నాడు సాహిత్యం విభాగంలో, శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి ఎవరనే విషయాన్ని ప్రకటిస్తారని నోబెల్ కమిటీ పేర్కొంది.

85ఏళ్ల ఇసాము అకసాకి నాగోయ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత ప్రొపెసర్‌గా సేవలందిస్తున్నారు. 2009వ సంవత్సరంలో అధునాతన టెక్నాలజీ విభాగంలో క్యోటో ప్రైజ్‌ను, 2011లో ఎడిషన్ మెడల్‌ను పొందారు.
54ఏళ్ల హిరోషి అమానో కూడా నాగోయ విశ్వవిద్యాలయంలోనే ప్రొపెసర్‌గా కొనసాగుతున్నారు. ఇక 60ఏళ్ల షుజి నకమురాలు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొపెసర్‌గా విధులను నిర్వహిస్తున్నారు.

BREAKINGNEWS #Nobelprize2014 Physics to Isamu Akasaki, Hiroshi Amano @NagoyaUniv_info Shuji Nakamura @ucsantabarbara pic.twitter.com/hgbABOxUlm
— The Nobel Prize (@NobelPrize) October 7, 2014

The principle for light-emitting diodes LED (upper left) and an example of a blue LED lamp. #nobelprize2014 #Physics pic.twitter.com/cxzXyP7zoj
— The Nobel Prize (@NobelPrize) October 7, 2014

Click it and Unblock the Notifications