ఐఎస్ఐఎస్ దారుణం: 120 మంది సజీవ దహనం
సిరియా: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు రెచ్చి పోయారు. సిరియా దేశ తీర ప్రాంతాల్లో పలు చోట్ల మానవ బాంబులు పేల్చి 120 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ రక్తదాహానికి అంతు లేదని మరో సారి నిరూపించుకున్నారు.

దాదాపు 100 మంది శవాలు గుర్తు పట్టలేని విధంగా రక్తపు ముద్దలు అయ్యాయి. వందలాధి మందికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కోందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అమాయకులను టార్గెట్ చేసుకుని వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని సమాచారం.
ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేశారని సిరియా ఆర్మీ అధికారులు అంటున్నారు. అయితే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు. అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు అలవాటే అని సిరియా అధికారులు అంటున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications